Suicide Letter : ఏ ఆడపిల్లా నా అత్తింటి మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు..

‘ఏ ఆడపిల్లా నా కుటుంబంలో మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు’అని కోరుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబం గురించి ఆలోచించేలా చేసింది.

Suicide Letter : ఏ ఆడపిల్లా నా అత్తింటి మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు..

Rajasthan Young Woman Suicide Letter (1)

Rajasthan woman Suicide Letter : ‘ఏ ఆడపిల్లా నా కుటుంబంలో మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు’అని కోరుతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సదరు కుటుంబం గురించి ఆలోచించేలా చేసింది. ఆమె ఎంత బాధలు అనుభవిస్తే ఇలా రాసి ఉంటుందనుకుంటున్నారు స్థానికులు. రాజస్థాన్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటు రెండు పేజీల లేఖ రాసి ప్రాణాలు వదిలింది. దీంతో ఆమె పుట్టింటివారు తమ కూతురికి పెళ్లి చేసి ఏడాది తిరగకుండానే అత్తింటిబాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బిడ్డను తలచుకుంటు..పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజస్థాన్ రాష్ట్రం బూందీ జిల్లాల్లో తాలాబ్ ప్రాంతానికి చెందిన నస్రీమ్‌ అనే యువతికి 2020 మార్చిలో సాహిల్ అనే యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు తల్లిదండ్రులు. అత్తారింటికి పంపించారు. కానీ కొంతకాలానికే అత్తింటివారు వేధిపులు ప్రారంభించారు. తనకు పెళ్లి కోసం తల్లిదండ్రులు చేసిన అప్పులు ఆమె కళ్లముందు మెదిలాయి. దీంతో అత్తింటివారు పెట్టే బాధల్ని భరించటం అలవాటు చేసుకుంది.

Read more : Pregnant Woman Suicide : వివాహిత మహిళ ఆత్మహత్య

అత్తమామలే కాకుండా భర్తకూడా తనను వేధించటంతో ఆమె బాధ ఎవరికి చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయేది. కానీ వేధింపులు కాస్తా..కొట్టేవరకు వెళ్లింది. అలా దాదాపు సంవత్సరం అంతా వారి బాధల్ని భరించింది..సహించింది. కానీ ఇలా ఎంతకాలం తనే బాధలు భరిస్తు ఉండాల్సిందేనా అనుకుంది. అలా బాధలు భరించలేక నస్రీమ్ పుట్టింటికి వచ్చేసింది. అక్కడే కొంతకాలంగా ఉంటోంది.అలా పుట్టింటిలోనే ఎంత కాలం ఉండాలి వారికి భారంగా అనుకుంది. అలాగని అత్తింటికి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది. తను ఉన్నంత కాలం తల్లిదండ్రులకు బాధలు తప్పవు అనుకుందో ఏమోగానీ..గత బుధవారం రాత్రి అందరు భోజనాలు చేశాక..తన గదిలోకి వెళ్లి పడుకుంది. అందరు పడుకున్నాక..ఆత్మహత్యకు పాల్పడింది.

Read more : Nalgonda District : వివాహిత మహిళ ఆత్మహత్య

తెల్లవారాక విషయం తెలుసుకున్న నస్రీమ్ తల్లిదండ్రులు బిడ్డ శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆత్మహత్య చేసుకుంటు నస్రీమ్ రాసి రెండు పేజీల లేఖను చదివిన వారికి అసలు విషయం అర్థమైంది. లేఖలో ‘‘అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను..అలాగని పుట్టింటిలో ఎంతకాలం ఉండాలి? అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తన అత్తింట్లో మగాళ్లను ఏ ఆడపిల్లా పెళ్లి చేసుకోవద్దని కూడా ఆమె రాసింది. అక్కడ ఉన్నన్నాళ్లూ తాను పడ్డ కష్టాలన్నిటినీ లేఖలో రాసిపెట్టింది.

ఆ లేఖను నస్రీమ్ తల్లిదండ్రులు పోలీసులకు అందజేసి వారిపై ఫిర్యాదు చేశారు.అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు మరణించిందని నస్రీమ్ తండ్రి ఫరూఖ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నస్రీమ్ ఆత్మహత్య లేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఆమె ఎన్ని బాధలు అనుభవిస్తే అలా రాసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు.