Pregnant Woman Suicide : వివాహిత మహిళ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఇంద్రరెడ్డినగర్ లో ఓ వివాహిత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Preganent Women Suicide
Pregnant Woman Suicide : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఇంద్రరెడ్డినగర్ లో ఓ వివాహిత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మిర్జాగుడా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డి నగర్ కంచె ప్రాంతానికి చెందిన రేవతి అనే మహిళకు 7 నెలల క్రితం రాహుల్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది.
రాహుల్ జెసిబి డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రేవతి ప్రస్తుతం గర్భవతి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం సాయంత్రం రేవతి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Man Cheated Girl : తనను వదిలేసి వెళ్లిన మొగుడ్ని చొక్కా పుచ్చుకు లాక్కెళ్ళిన భార్య