గో బ్యాక్ కరోనా : ఇంకా 9 రోజులు..ఇంటి దగ్గరే ఉందాం

  • Publish Date - April 6, 2020 / 01:12 AM IST

ప్రస్తుతం గో బ్యాక్ కరోనా అంటున్నారు జనాలు. ఇక ఇక్కడ ఉండకు వెళ్లిపో అంటూ నినదిస్తున్నారు. దిక్కుమాలిన ఈ వైరస్ వల్ల తాము ఎంతో కోల్పోయామని..ఇక ఈ కష్టాలు వద్దంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారీ ఎంతో మందిని బలి తీసుకుంది. లక్షలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

చైనా నుంచి వచ్చిన కరోనా..కొద్ది రోజుల్లోనే ప్రపంచ దేశాలను చుట్టేసింది. ఓ వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ వైరస్ సోకుతుందని గ్రహించి..లాక్ డౌన్ తెరపైకి తీసుకొచ్చారు. భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన రాకాసి వల్ల 50 మందికి పైగానే చనిపోయారు. (ప్రపంచ దేశాలపై కరోనా పంజా…12 లక్షలు దాటిన బాధితులు…ఒక్కరోజే 65వేలకుపైగా కొత్త కేసులు )

కరోనా వైరస్ కట్టడి చేయడంలో భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. తొలుత జనతా కర్ఫ్యూను ప్రకటించిన భారత ప్రధాని..అనూహ్యంగా లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు. 2020, మార్చి 10వ తేదీ నుంచి 21 రోజుల పాటు ఈ నిబంధన ఉంటుందని వెల్లడించారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

ఎవరైనా కరోనా లక్షణాలు కనిపిస్తే..వైద్యులను సంప్రదించాలని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. దీంతో ఎక్కడి వారెక్కడే ఉండిపోయారు. తొలుత ఈ నిబంధన పాటించకపోయినా..కొద్ది రోజుల తర్వాత..పక్కాగా లాక్ డౌన్ అమలవుతోంది. కానీ..ప్రధాని ఇచ్చిన గడువు ముగియడానికి కేవలం 9 రోజులు మాత్రమే ఉంది. ఈ రోజులే అత్యంత కీలకమని అంటున్నారు వైద్య నిపుణులు. ఎవరిళ్లకు వారు పరిమితం కావాలని సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభించింది.

వైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించాలంటే..14 రోజుల వ్యవధి నిర్ణయించుకున్నారు. 
వీరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందిన వారిలో బయటపడటానికి మరో 7 నుంచి 10 రోజుల సమయం పడుతుందని అంచాన వేస్తున్నారు. 
 

ఓ వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ వైరస్ సోకుతుండడంతో..అందరూ ఇంటి పట్టునే ఉంటే..కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతాయని అంటున్నారు. 
తొలుత నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా కనిపించాయి. వీరితో సన్నిహితంగా మెలిగిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. 
 

కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మార్చి 17 నుంచి 19వ తేదీల్లో మర్కజ్ ప్రయాణీకులు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టారు. 
అమాంతం కేసుల సంఖ్య పెరిగిపోయాయి. సుమారు 4 వేల మంది దాక వేర్వేరు గదుల్లో ఉంచారు. 
 

వీరి నుంచి వైరస్ సోకినట్లుగా భావిస్తున్న వారికి కూడా పరీక్షలు నిర్వహించారు. 
ప్రస్తుతం 9 రోజులు మాత్రమే ఉన్నాయని..దీనిని అందరూ సద్వినియోగం చేసుకుని..ఇంటి పట్టునే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.