యాహూ.. గోల్కొండ రోప్‌వే నిర్మాణానికి మరో అడుగు ముందుకు పడిందోచ్‌..

ఆ సంస్థ 3 నెలల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణానికి ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా ఏదైనా కంపెనీని ఎంపిక చేస్తారు.

ropeway

Golconda Fort: గోల్కొండ రోప్‌వేకు లైన్‌ క్లియర్‌ అయింది. కోట నుంచి టూంబ్స్‌ వరకు (దాదాపు 1.5 కిలోమీటర్ల మేర) నిర్మాణానికి ఇప్పటికే ప్లాన్ వేసుకున్న విషయం తెలిసిందే. పర్యాటకులు గోల్కొండ కోటను చూశాక రోప్‌వే ద్వారా టూంబ్స్‌కు, అక్కడ నుంచి కోటకు సులభంగా చేరుకోవచ్చు. ఈ రోప్‌వే పీపీపీ భాగస్వామ్యంలో ఏర్పాటు కానుంది.

ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖరీదుతో పాటు సామర్థ్యం వంటి అంశాల అధ్యయనం కోసం నైట్‌ఫ్రాంక్ సంస్థను కన్సల్టెన్సీగా హెచ్‌ఎండీఏ ఎంపిక చేసింది. హెచ్‌ఎండీఏ గతంలో టెండర్లు ఆహ్వానించగా నైట్‌ఫ్రాంక్ సహా రైట్స్, కేఅండ్‌జే కంపెనీలు ముందుకు వచ్చాయి.

Also Read: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమేనా?

వాటిలో ఇప్పుడు నైట్‌ఫ్రాంక్ ఎంపికైంది. ఆ సంస్థ 3 నెలల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణానికి ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా ఏదైనా కంపెనీని ఎంపిక చేస్తారు.

రోప్‌వే నిర్మాణం కోసం అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం జరగనుంది. గోల్కొండ నుంచి టూంబ్స్ మధ్య రక్షణ శాఖకు సంబంధించిన స్థలాలు సైతం ఉన్నాయి. రోప్‌వే నిర్మాణానికి రైట్ ఆఫ్ వేను రూపొందించడం, కవాల్సిన వనరులపై కూడా అధ్యయనం చేస్తారు.

భారత్‌లో ఇప్పటికే మనాలితో పాటు గ్యాంగ్టక్, నలందా, డార్జిలింగ్, ఉదయ్ పూర్, సిమ్లా వంటి పలు ప్రాంతాల్లో రోప్ వేలు ఉన్నాయి.

గోల్కొడ కోటను ప్రతిరోజు దాదాపు 10,000 మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. కోట నుంచి టూంబ్స్‌ వరకు రోప్‌వే పూర్తయితే కేవలం 10 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణ కోసం రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.