Gold rates
Gold And Silver Rate Today: గత రెండు నెలలుగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతూ అదేస్థాయిలో తగ్గుతూ వస్తున్నాయి. అయితే, గత మూడు రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా బుధవారం ఉదయం వరకు నమోదైన ధరలను బట్టిచూస్తే గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు నిన్నటితో పోల్చితే పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మరోవైపు వెండి ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి.
Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణ ప్రాంతాల్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,840 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,830 వద్ద కొనసాగుతుంది. మంగళవారం ధరలతో పోల్చితే బుధవారం ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,990 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,900 వద్ద కొనసాగుతుంది. ముంబయి, బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,840 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,830గా ఉంది. చెన్నైలో మాత్రం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ. 50 పెరిగింది. దీంతో చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,200 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,210కి చేరింది.
Gold
వెండి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండిపై రూ. 500 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 78వేలకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ కిలో వెండిపై రూ.500 పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలో వెండి రూ. 74,500 చేరింది. ముంబయిలో రూ. 74,500, చెన్నైలో 78వేలుకు చేరింది. బెంగళూరులో వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం బెంగళూరులో కిలో వెండి రూ. 73,250 వద్ద కొనసాగుతుంది.