Hyderabad : రూ.7కోట్ల విలువైన ఆభరణాలతో కారు డ్రైవర్ జంప్ .. నిందితుడు శ్రీనివాస్ కోసం పోలీసుల గాలింపు

నమ్మకంగా ఉంటూనే యజమానికి పెద్ద టోకరా ఇచ్చి రూ.7 కోట్ల రూపాయల విలువైన నగలతో జంప్ అయ్యాడు కారు డ్రైవర్. హైదరాబాద్లో ఓ నగల వ్యాపారం వద్ద పనిచేసే కారు డ్రైవర్ కోట్ల రూపాయల విలువైన నగలు పట్టుకుని ఎస్కేప్ అయ్యాడు.

Gold merchant's car driver escapes with jewelery worth Rs 7 crore in SR Nagar

Hyderabad : నమ్మకంగా ఉంటూనే యజమానికి పెద్ద టోకరా ఇచ్చి రూ.7 కోట్ల రూపాయల విలువైన నగలతో జంప్ అయ్యాడు కారు డ్రైవర్. హైదరాబాద్లో ఓ నగల వ్యాపారం వద్ద పనిచేసే కారు డ్రైవర్ కోట్ల రూపాయల విలువైన నగలు పట్టుకుని ఎస్కేప్ అయ్యాడు. ఎన్నాళ్లు ఇలా కారు స్టీరింగ్ తిప్పుతు బతకాలి? అనుకున్నాడో లేదో పక్కనే కోట్ల రూపాయల విలువైన నగలు ఉన్నాయి..పక్కన ఎవ్వరులేరు పట్టుకుపోవాలని దుర్భద్ధి ఆక్షణంలోనే పుట్టిందో ఏమోగానీ ఎంతో నమ్మకంగా పనిచస్తూనే అదును చూసి శుక్రవారం (ఫిబ్రవరి 18,2023) యజమానికి టోకరా 7 కోట్ల రూపాయల విలువైన నగలు పట్టుకుని పారిపోయాడు కారు డ్రైవర్.దీంతో నగర వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సదరు నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మాదాపూర్‌లోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. అదే అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న అనూష రూ.50లక్షల విలువచేసే ఆభరణాలను ఆర్డరు చేశారు. ఆమె శుక్రవారం సాయంత్రం మధురానగర్‌లో బంధువుల ఇంట్లో ఉన్నారు. తాను ఆర్డరు చేసిన నగలను అక్కడికే పంపమని చెప్పడంతో రాధిక తన కారులో డ్రైవర్‌ శ్రీనివాస్, సేల్స్‌మెన్‌ అక్షయ్‌లకు ఆ నగలను ఇచ్చి పంపించారు. అలా వారిద్దరు కారులో మధురానగర్‌కు చేరుకున్నారు నగలతో సహా. డ్రైవర్‌ కారులోనే ఉన్నాడు. సేల్ప్ మెన్ అక్షయ్‌ అనూష ఆర్డర్ చేసిన రూ.50 లక్షల విలువైన నగలు పట్టుకుని ఆమె చెప్పిన అడ్రస్ కు  వెళ్లి నగలను ఇచ్చి తిరిగి వచ్చేసరికి అక్కడ కారులేదు..డ్రైవర్ శ్రీనివాస్ లేడు. దీంతో అక్షయ్ డ్రైవర్ శ్రీనివాస్ కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అతని నగలు పట్టుకుని పరారయ్యాడా?అనే అనుమానం వచ్చింది. పదే పదే ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవటంతో నిర్ధారించుకున్నాడు. యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

అక్షయ్ నగలు పట్టుకుని వెళ్లటంతో తన పక్కనే వేరే వ్యాపారికి ఇవ్వాల్సిన రూ.7 కోట్లు విలువైన వజ్రాల నగలు ఉండటంతో డ్రైవర్‌ శ్రీనివాస్‌ కు దర్భుద్ధి పుట్టిందేమో..ఈ కారు డ్రైవర్ ఉద్యోగం ఎన్నాళ్లు చేస్తే అన్ని డబ్బులొస్తాయనుకున్నాడో ఏమో కారుతో సహా పరారయ్యాడు. కారులో సిరిగిరిరాజ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లర్స్‌కు తిరిగి ఇవ్వాల్సిన రూ.7కోట్ల వజ్రాభరణాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న వ్యాపారి రాధిక ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డ్రైవర్‌ శ్రీనివాస్‌ కోసం గాలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.