Indiramma Indlu
Indiramma houses: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఒక్కో అడుగు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మొదటి విడత కింద లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అధికారులు అందజేశారు. దీంతో వేగంగా ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యి ఇళ్ల పనులు స్టార్ట్ అవుతున్నాయి.
Also Read: కవిత లేఖను లీక్ చేసింది ఎవరు..? బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ
మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20వేల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. ఇందులో 5,200 ఇళ్లు బేస్ మెంట్ వరకు పూర్తయ్యాయి. 300 ఇళ్లు గోడలు పూర్తయ్యి స్లాబ్ కు రెడీ అవుతున్నాయి. మరో 200 ఇండ్లకు స్టాబ్స్ దాకా పూర్తయి ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే, ఈ నెలాఖరులోగా మొత్తం వెయ్యి ఇళ్లు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక ఇంటిలో గృహప్రవేశంకు పనులు పూర్తి చేయాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీలో అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలో 10,66,953 మంది ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 18వేల మంది వరకు మాత్రమే సొంత స్థలం ఉంది. మిగిలిన వారికి ఇళ్లు మంజూరు చేయాలంటే స్థలాలు లేవు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 15 ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించి అందులో జీప్లస్ 3 మోడల్ లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదలకు అందజేయాలని భావిస్తోంది. ఇప్పటికే 15 ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించి స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఒక్క ఎకరా పరిధిలో 300 ఇళ్లు నిర్మించాలని హౌసింగ్ అధికారులు నిర్ణయించారు.
జీహెచ్ఎంసీలో టవర్లు కట్టనున్న ప్రాంతాలు, నియోజకవర్గాలు .. షేక్ పేట (ఖైరతాబాద్), హిమాయత్ నగర్ (ముషీరాబాద్), సైదాబాద్ (యాకుత్ పుర, మలక్ పేట), ఆసిఫ్ నగర్ (కార్వాన్, గోషామహాల్, నాంపల్లి), మారేడుపల్లి (సికింద్రాబాద్), తిరుమలగిరి (కంటోన్మెంట్), బండ్లగూడ (చాంద్రాయణగుట్ట)