School Holidays
School Holidays: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఆగస్టు నెలలో పాఠశాలలకు కనీసం 10రోజులు సెలవులు వస్తున్నాయి. ఈనెలలో రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, గణేష్ చతుర్ధితోపాటు వివిధ రోజుల్లో పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ముఖ్యంగా 8, 9, 10 తేదీల్లో.. మళ్లీ 15 నుంచి 17వ తేదీ వరకు వరుసగా సెలవులు రానున్నాయి.
Also Read: APPSC Big Update: బిగ్ అలెర్ట్.. APPSC లో కీలక మార్పులు.. ఇకనుంచి ప్రిలిమ్స్ పరీక్ష ఉండదా?
ఆగస్టు నెలలో పాఠశాలలకు సెలవుల జాబితా:
ఆగస్టు 8వ తేదీ : వరలక్ష్మీ వ్రతం (శుక్రవారం),
ఆగస్టు 9వ తేదీ : రెండో శనివారం సందర్భంగా సెలవు
ఆగస్టు 10వ తేదీ : ఆదివారం
ఆగస్టు 15వ తేదీ : స్వాతంత్ర్య దినోత్సవం (శుక్రవారం)
ఆగస్టు 16వ తేదీ : శ్రీ కృష్ణాష్టమి (శనివారం)
ఆగస్టు 17వ తేదీ : ఆదివారం.
ఆగస్టు 24వ తేదీ : ఆదివారం
ఆగస్టు 27వ తేదీ : వినాయక చవితి (బుధవారం)
ఆగస్టు 31వ తేదీ : ఆదివారం
ఇదిలాఉంటే.. ఆగస్టు నెలలో స్వాతంత్ర్య దినోత్సవం ఉంది. దీంతో ఆగస్టు 15కు ముందు రెండు మూడు రోజులు ఆటల పోటీలు, వివిధ సాంస్కృతి కార్యక్రమాలు పాఠశాలల్లో జరుగుతుంటాయి. అంటే ఆ రోజుల్లో కూడా తరగతులు పెద్దగా కొనసాగవు. ఈ విధంగా మొత్తం ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుస సెలవులు వస్తుండటం ఎంజాయ్ వాతావరణం నెలకొంటుంది.
ఇలా చేయండి ..
ఆగస్టు నెలలో వరుసగా సెలవులు వస్తుండటంతో విద్యార్థులు కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాకుండా విజ్ఞాన్ని పెంచుకునే విషయాలపై దృష్టిసారించాలి. అదే సమయంలో ఆటలకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
స్నేహితులతో ఆటలు ఆడుతూ సందడి చేయడంతోపాటు.. విజ్ఞానం పెంచుకునేందుకు కొత్తకొత్త అంశాలను నేర్చుకునేలా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ప్రస్తుతం అంతా ఏఐ యుగం. అందులో ఏ విధమైన సాంకేతికత ఉంది. మన చదువుకు ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాలు తెలుసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించే వారి చదువుకు ఎంతో తోడ్పాటునందిస్తుంది.