APPSC New Changes: బిగ్ అలెర్ట్.. APPSC లో కీలక మార్పులు.. ఇకనుంచి ప్రిలిమ్స్ పరీక్ష ఉండదా?
APPSC New Changes: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులు చేయనుంది. ఇకనుంచి ఈ నోటిఫికేషన్ కైనా పోస్టుల సంఖ్య కంటే 200 రెట్లు దరఖాస్తులు వస్తేనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది.

Appsc to make key changes in the conduct of prelims exam
APPSC New Changes: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులు చేయనుంది. ఇకనుంచి ఈ నోటిఫికేషన్ కైనా పోస్టుల సంఖ్య కంటే 200 రెట్లు దరఖాస్తులు వస్తేనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పంపించామని APPSC కమిషన్ అధికారులు తెలిపారు.
కొత్త విధానం ఎలా ఉండబోతుంది?
100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైతే వాటికి 20,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. అంతకన్నా తక్కువ దరఖాస్తులు వస్తే ప్రిలిమ్స్ కాకుండా నేరుగా మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న విధానంలో చూసుకుంటే దరఖాస్తులు 25,000 దాటితే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే, దీనివల్ల సమయం, ఖర్చు, వనరుల వృథా అవుతున్నాయని APPSC భావిస్తోంది. అందుకే ఈ కొత్త ఫిల్టరింగ్ విధానం తీసుకురావాలనే ఉద్దేశంలో ఉంది. కొత్త పద్ధతివల్ల పరీక్షల నిర్వహణ వ్యయం తగ్గుతుంది, అభ్యర్థుల ఎంపిక మరింత సమర్థవంతంగా చేయవచ్చు, త్వరగా నియామక ప్రక్రియ పూర్తిచేయవచ్చు.కాబట్టి, ఈ ప్రతిపాదనకు రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపితే రాబోయే గ్రూప్, ఇతర నోటిఫికేషన్లలోనే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.