School Holidays
School Holidays : స్కూల్, కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్. యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే క్రిస్మస్ వేడుకలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 25న తేదీన పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, క్రిస్మస్ పండుగ సందర్భంగా, ఆ తరువాతి రోజు బాక్సింగ్ డే ప్రధాన్యతను దృష్టిలో ఉంచుకొని స్కూళ్లకు వరుసగా సెలవులు రానున్నాయి. ఈ క్రమంలో సిటీల నుంచి ఊర్లకు వెళ్లే విద్యార్థులు దాదాపు ఐదు రోజులు సెలవులు తీసుకునే అవకాశం ఉంది.
Also Read : Telangana Govt : మహిళలకు శుభవార్త.. మరో కొత్త పథకంకు తెలంగాణ సర్కార్ కసత్తు.. పది రోజుల్లో మార్గదర్శకాలు..
ఇవాళ్టి (డిసెంబర్ 24) నుంచి కంటిన్యూగా ఐదు రోజులు విద్యార్థులు సెలవులు పొందే అవకాశం ఉంది. సిటీల నుంచి ఊర్లకు వెళ్లాలి అనుకునేవారు ఏం చక్కా తమ సొంత గ్రామాలకు వెళ్లి పండుగ వేళ ఎంజాయ్ చేసిరావొచ్చు. ఈ రోజు నుంచి బయలుదేరితే డిసెంబర్ 29వ తేదీ (సోమవారం) స్కూళ్లకు రావచ్చు. అయితే.. రెండు రాష్ట్రాల మధ్య ఈ సెలవుల అమలులో స్వల్ప తేడాలు ఉన్నాయి. విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులు తీసుకునే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఈ రోజును ఐచ్ఛిక సెలవుగా ప్రకటించారు. అంటే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరిచే ఉంటాయి. అయితే.. సెలవు కావాలనుకునే ఉద్యోగులు ముందుగా సమాచారం ఇచ్చి ఈ వేతనంతో కూడిన సెలవును పొందవచ్చు. డిసెంబర్ 25 క్రిస్మస్ కాబట్టి ఇది సాధారణ సెలవుగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసి ఉంటాయి. డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా తెలంగాణలో ఈ రోజు కూడా అధికారిక సెలవు దినమే. అంటే వరుసగా రెండు రోజులు (25, 26) విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు లభించనున్నాయి. డిసెంబర్ 24 ఆప్షనల్ హాలీడే కలుపుకుంటే వరుసగా మాడ్రోజులు సెలవులు రానున్నాయి. ఇక సిటీల నుంచి ఊర్లకు వెళ్లే విద్యార్థులు శనివారం సెలువు పెట్టుకుంటే మరుసటి రోజు ఆదివారం అధికారిక సెలవు. తిరిగి 29వ తేదీన స్కూళ్లకు తిరిగి రావొచ్చు. ఇలా ప్లాన్ చేసుకుంటే వరుసగా ఐదు రోజులు సెలువు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఏపీలో ఇవాళ (డిసెంబర్ 24న) క్రిస్మస్ ఈవ్ పేరు ఆప్షనల్ హాలిడే ఉంది. ఈ కారణంగా చాలా స్కూళ్లలో సెలవు ఇచ్చారు. ఇక డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం హాలిడే. డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే ఉంది. ఆ రోజు కూడా ఆప్షనల్ హాలిడే ఉంది. ఆ రోజు కూడా చాలా స్కూళ్లకు సెలవు ఇస్తున్నారు. డిసెంబర్ 27వ తేదీన నాలుగో శనివారం, కొన్ని స్కూళ్లలో నాలుగో శనివారం సెలవు ఇస్తున్నారు. మరికొన్ని స్కూళ్లలో సెలవు ఇవ్వట్లేదు. అయితే, సెలవు ఇవ్వని స్కూళ్లలో విద్యార్థులు.. ఊర్లకు వెళ్తున్న కారణంగా సెలవు కోరి తీసుకోవచ్చు. అదే సెలవు ఉంటే.. ఏ సమస్యా ఉండదు. ఎందుకంటే డిసెంబర్ 28న ఆదివారం కాబట్టి. ఆ రోజు ఎలాగూ స్కూళ్లకు సెలవు ఉంది. అందువల్ల సిటీలో చదువుకునే విద్యార్థులు.. తమతమ ఊళ్లకు వెళితే ఐదు రోజులు సెలవుల్ని ఎంజాయ్ చేయొచ్చు.