Kavitha Vs BRS: ఆమె డోస్ పెంచుతున్నారు. కారు పార్టీలోని ఒక్కో సీనియర్ లీడర్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మొన్నటిదాకా ఆమె కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోని కారు పార్టీ లీడర్లు ఇప్పుడు తగ్గేదేలే అంటూ వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఎంతైనా అధినేత కూతురు..ఇంటి ఆడబిడ్డ లాంటిదని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చిన గులాబీ లీడర్లు..ఇక అక్కపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఊరుకునేదే లేదంటూ తేల్చి చెబుతున్నారు. యాక్షన్‌కు రియాక్షన్..కౌంటర్‌కు ఎన్‌కౌంటర్ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ అటాక్ చేస్తున్నారు. కవిత తగ్గట్లేదు..దీంతో బీఆర్ఎస్ లీడర్లు కూడా తామేం తక్కువ కాదంటూ రంగంలోకి దిగుతున్నారు. అటాకింగ్ ఫైట్‌లో ఎవరిది పైచేయి? కవిత విషయంలో బీఆర్ఎస్ తీరులో మార్పు వెనుక కారణమేంటి.?
జాగృతి జనం బాట. రోజుకో ఏరియాలో… వారానికో జిల్లాలో కవిత పర్యటన. పార్టీ పెట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..వారానికోసారి బిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ బ్లాస్టింగ్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. మెదక్ కు వెళ్లి హరీశ్ రావును టార్గెట్ చేశారు. వరంగల్ పర్యటనలోనూ హరీశ్ రావుపైనే గురి పెట్టారు. ఇక వనపర్తి పర్యటనలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇక్కడా నిరంజన్ ను హరీష్ మనిషంటూ సంబోధించారు. ఇక అంతకముందు మరో మాజీమంత్రి జగదీష్ రెడ్డిపైనా ఘాటు వ్యాఖ్యలే చేశారు కవిత. అప్పుడు జగదీష్ రెడ్డి..ఇప్పుడు నిరంజన్ రెడ్డి..ఇద్దరూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. కవిత ఒకటంటే తాము రెండు అంటాం అన్నట్లుగా..సున్నితంగా, సుతిమెత్తగా పదునైన విమర్శలే చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడుతూ వస్తున్నారు. లేటెస్ట్ గా మాజీమంత్రి నిరంజన్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది అంటూ నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు కవిత. పెద్దఎత్తున అవినీతి చేశారని, ఫామ్ హౌస్ లు, ఆస్తులు ఎలా సంపాదించారని నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన నిరంజన్ రెడ్డిపై కవిత ఇలా అవినీతి ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
ఎందుకంటే వరుసగా మాజీ మంత్రులపై విమర్శలు గుప్పిస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తున్న కవిత..పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని స్వయంగా ఆమే ఒప్పుకుంటున్నారనే సంకేతాలు ఇస్తుండటం బీఆర్ఎస్ ను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఇక కవితకు కౌంటర్ ఇవ్వాల్సిందేనని డిసైడ్ అయిందట గులాబీ దళం. ఇందులో భాగంగానే కవిత కామెంట్స్ కు నిరంజన్ రెడ్డి కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. తాను నీళ్ల నిరంజన్ రెడ్డిని కాకపోయినా పర్వాలేదు కానీ లిక్కర్ రాణి అనే పేరు మీరు అలానే ఉంచుకోండి అంటూ రివర్స్ అటాక్ చేశారు. ఇలా కవిత ఒక్కటంటే తాము రెండంటామనే సంకేతాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇంకా కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకుంటూ పోతే పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. కవిత తీరు ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంగా మారుతుందని, ఆమెకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకపోతే పార్టీకి నష్టం తప్పదని అంచనా వేస్తున్నారట. అందుకే బీఆర్ఎస్ సీనియర్లు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతూ కవిత కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మొన్నటివరకు కవిత చేసిన వ్యాఖ్యలన్నింటినీ అధినేత కూతురని..ఇంటి ఆడపిల్ల లాంటిదని చూసి చూడనట్లు ఊరుకున్నామంటున్నారు. కానీ తన పర్యటనపై అటెన్షన్ కోసం కవిత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు కారు పార్టీ లీడర్లు.
లైట్ తీసుకుంటే.. పార్టీకి కూడా డ్యామేజ్..!
అయితే ఆమె వ్యాఖ్యలను లైట్ తీసుకుంటే..లీడర్లుగా తమ నేమ్ బ్యాడ్ అవడంతో పాటు పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుందని..ఇక ఔట్ రైట్ గా ఇచ్చిపడేయటం స్టార్ట్ చేశారట. ఇకపై కవిత విషయంలో ఏ మాత్రం సహించేది లేదని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తరహాలోనే కవితను ట్రీట్ చేయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీ నేతలను కవిత టార్గెట్ చేస్తే వెంటనే కౌంటర్ ఇవ్వాలని ముఖ్యనేతలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్.
పార్టీపైన, పార్టీ లీడర్లపై కవిత విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా ఆమెకు లెఫ్ట్ రైట్ ఇవ్వాలని పైనుంచి సంకేతాలు పంపారట. అధికార పార్టీ నేతలను వదిలేసి ప్రతిపక్ష నేతలపై కవిత దాడి చేయడం ఏంటని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేకాదు పదేళ్లు తమతో కలిసి పనిచేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు. కవిత కామెంట్స్ కు ధీటుగా రిప్లయ్ ఇవ్వాలని, ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని చెప్పినట్లు ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలో కవిత తన విమర్శల దాడిని తగ్గిస్తారా? ఆమె ఇలాగే పదునైన వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ ఇంకా ఘాటైన దాడి మొదలు పెడితే తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Also Read: మోగిన ఎన్నికల నగారా.. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..