ఆ సీటుకు బైపోల్‌ పక్కానా? వాళ్లు డిసైడ్ అయ్యారా? కేటీఆర్ భేటీ అందుకేనా?

అధికార కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులను బీఆర్ఎస్ ముందే పసిగట్టిందట.

KTR

తెలంగాణ పాలిటిక్స్‌ తెగ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. రేపోమాపో ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా..ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతున్న రేంజ్‌లో..పీక్‌ లెవల్‌ డైలాగ్‌ వార్‌తో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే జంపింగ్‌ ఎమ్మెల్యేలపై వేటుతో ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుండగా..ఇప్పుడు మరోసీటు కూడా ఆ జాబితాలో చేరబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లో పడేసేలా సరికొత్త వ్యూహం అమలు చేస్తుందట కాంగ్రెస్.

అసెంబ్లీలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని..మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఇప్పటికే ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్ చేశారు. అంతేకాదు జగదీశ్‌రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. ఎథిక్స్ కమిటీ ద్వారా జగదీశ్‌రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికార పార్టీ భావిస్తుంది. జగదీశ్‌రెడ్డిపై అన్హరత వేటు వేసి..సూర్యాపేటలో ఉప ఎన్నిక తీసుకురావాలని చూస్తోందట.

అప్పర్ హ్యాండ్ సాధించొచ్చని భావిస్తున్న కాంగ్రెస్
సూర్యాపేటకు ఉపఎన్నిక వస్తే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై అప్పర్ హ్యాండ్ సాధించొచ్చని భావిస్తోందట కాంగ్రెస్. ఇప్పుడు ఎన్నికలు జరిగితే సూర్యాపేట అసెంబ్లీ సీటును తాము ఈజీగా గెలుస్తామని లెక్కలు లెక్కలు వేసుకుంటుందట. ఆ సీటుకు బైపోల్‌ వస్తే బీఆర్‌ఎస్‌పై రెండు రకాలుగా పై చేయి సాధించొచ్చని ఆలోచన చేస్తుందట కాంగ్రెస్. ప్రభుత్వం విఫలమైందంటూ పదేపదే ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలనే ప్లాన్ ఒకటైతే..బైపోల్‌లో గెలిచి బీఆర్ఎస్‌ను కట్టడి చేయాలనేది మరో స్కెచ్ అట.

అధికార కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులను బీఆర్ఎస్ ముందే పసిగట్టిందట. ఆల్ అఫ్ సడెన్‌గా అధికార కాంగ్రెస్ వ్యూహం మార్చడంతో..యాక్షన్‌కు రియాక్షన్ అన్నట్లుగా బీఆర్ఎస్ కూడా మాస్టర్ స్కెచ్ వేస్తోందట. సూర్యాపేటలో ఉపఎన్నిక తీసుకురావాలని అధికారపక్షం వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టాలని చూస్తోందట. సూర్యాపేటలో ఉపఎన్నిక వచ్చిన దాని సమర్థవంతంగా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..జిల్లాల సమీక్షలను మొట్టమొదటగా సూర్యాపేట నుంచి ప్రారంభిస్తున్నారట.

జగదీశ్‌రెడ్డిపై ఎథిక్స్‌ కమిటీ డెసిషన్‌ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ స్పీకర్ జగదీశ్‌రెడ్డిని ఎక్స్‌పెల్‌ చేస్తే పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయనే దానిపై ప్లస్‌ ఆర్ మైనస్‌లు వేసుకుంటున్నాయట పార్టీలు. ఈ నేపథ్యంలో జగదీశ్‌రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా? సూర్యాపేటలో ఉపఎన్నిక వస్తుందా.? వస్తే ఎవరు పైచేయి సాధిస్తారనేది వేచి చూడాలి మరి.