×
Ad

Cm Revanth Reddy: వేటు తప్పదా? మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌ సీరియస్.. గాడిన పెట్టేందుకు ఏం చేయబోతున్నారు?

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న మిగిలిన మూడు పోస్టులు భర్తీ చేసేప్పుడు..ఇప్పుడున్న క్యాబినెట్‌ మంత్రుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయట.

Cm Revanth Reddy: అందరూ సీనియర్ లీడర్లే. గతంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు కొందరు.. కొత్తగా అమాత్య పదవిలో కొనసాగుతున్న వాళ్లు ఇంకొందరు. కానీ సీనియర్ల మధ్య ఇగో పంచాయితీ. జూనియర్లు అంటే చిన్న చూపు అన్నట్లుగా ఉందట.. తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ల లొల్లి. ఒక మంత్రి అయిపోగానే మరో మంత్రి రచ్చకెక్కి ఇష్యూ చేస్తుండటంతో..ప్రభుత్వం, పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని సీఎం రేవంత్‌ సీరియస్ అవుతున్నారట. ఇలా అయితే కుదరదు. ఇక నుంచి యాక్షనే అంటున్నారట. మంత్రులను గాడిన పెట్టేందుకు సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారు? అమాత్యులపై చర్యలు అంటే ఎలా ఉండబోతున్నాయి?

తెలంగాణలో మంత్రుల మధ్య కొట్లాటలు.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పరువు సమస్యగా మారాయి. రెండేళ్లైనా నిండక ముందే..మంత్రులు గొడవలకు దిగడం.. సర్కార్ ఇమేజ్‌కు డ్యామేజ్ చేస్తుందని టాక్. అమాత్యుల గిల్లి కజ్జాలపై సీరియస్‌గా ఉన్న సీఎం రేవంత్..మంత్రులను గాడిన పెట్టడంపై దృష్టి పెట్టారట. మొన్న పొన్నం, అడ్లూరి..నిన్న కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..ఇప్పుడు వివేక్ ఎంట్రీతో..అడ్లూరితో వివాదంపై రచ్చ.

ప్రభుత్వాన్ని బజారున పడేస్తుందన్న భావన..

ఇలా రోజుకో ఇద్దరు మంత్రుల వివాదం న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారి ప్రభుత్వానికి హెడెక్‌గా మారిందట. పైగా డైరెక్టుగా అధిష్టానం పెద్దలకే ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకుంటుండటం కూడా ప్రభుత్వాన్ని బజారున పడేస్తుందన్న భావనలో ఉన్నారట సీఎం రేవంత్‌. ఈ క్రమంలోనే కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఉంటున్న మంత్రుల తీరుపై ఆగ్రహాంగా ఉన్న ముఖ్యమంత్రి..తీరు మార్చుకోవాలని సూచించారట.

మంత్రుల మధ్య అభిప్రాయ బేధాలు ఉంటే..ఇంటర్నల్‌గా డిస్కస్‌ చేసుకోవాలి కానీ.. మీడియాకెక్కి రచ్చ చేస్తుంటే ప్రభుత్వం పరువు పోతుందని..ఓ సీనియర్ మంత్రి వాపోయినట్లు టాక్. ప్రతిపక్షాల ముందు చులకన కావొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహంగా ఉన్నారట. మంత్రులకు అనుమానాలు, అపోహలు ఉంటే..నేరుగా తనతో మాట్లాడొచ్చని..అలా కాకుండా..ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడం ఏంటని..క్లాస్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివాదాస్పద మంత్రులపై యాక్షన్ తప్పదా?

సేమ్‌ టైమ్‌ వివాదాస్పద మంత్రులపై యాక్షన్ తప్పదని చెప్పకనే చెప్పారట ముఖ్యమంత్రి. నిత్యం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తూ..ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కుతున్న మంత్రులపై వేటు తప్పదని అంటున్నారట. అందులో భాగంగానే వివాదాస్పద మంత్రుల శాఖలపై సీఎంవో నిఘా పెట్టిందట. ఈ క్రమంలోనే కొండా సురేఖ శాఖలోని ఓఎస్డీని తప్పించారని అంటున్నారు. కాంట్రవర్సీల్లో నిలుస్తున్న మంత్రులను కూడా తప్పించేందుకు కూడా వెనకాడబోమంటున్నారట.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న మిగిలిన మూడు పోస్టులు భర్తీ చేసేప్పుడు..ఇప్పుడున్న క్యాబినెట్‌ మంత్రుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయట. అవసరమైతే కొందరు మంత్రులను తప్పించడమో .. లేకపోతే శాఖలను మార్చడమో చేయాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని మంత్రులకు సుతిమెత్తంగా సీఎం రేవంత్‌ వివరించారన్న టాక్ సెక్రటేరియట్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

ఏదేమైనా మంత్రుల ఆధిపత్య పోరు తలనొప్పిగా మారుతుండటంతో పాటు..జనరల్‌ ఎలక్షన్‌ రేసు మొదలవుతున్న టైమ్‌లో ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం జాప్యం చేయొద్దని సీఎం రేవంత్ ఫిక్స్ అయ్యారట. మరి ముఖ్యమంత్రి అల్టిమేటంతో అమాత్యుల తీరు మారేనా? లేకపోతే ఇలాగే గ్రూప్‌వార్‌ను కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.

Also Read: కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నా.. ‘జాగృతి జనం బాట‘ పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత