Gossip Garage : ఓవైపు సంబురం.. ఇంకోవైపు సమరం.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది.?

ప్రతిపక్ష పాత్ర పోషించాలని రేవంత్‌ సూచించడం విడ్డూరంగా ఉందంటోంది బీఆర్ఎస్. మూసీ నుంచి లగచర్ల వరకు..విద్యార్థుల ఫుడ్ పాయిజన్‌ ఘటనల నుంచి రైతు సమస్యల వరకు తాము ప్రజల తరఫును పోరాడుతూ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామంటోంది గులాబీ పార్టీ.

Gossip Garage Congress Vs Brs (Photo Credit : Google)

Gossip Garage : ఓ వైపు సంబురం..ఇంకోవైపు సమరం. కలసి రండి సలహాలు సూచనలు ఇవ్వండి. పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. పని చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెట్టడం మానుకోండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు చేస్తోన్న సూచన. ప్రజా విజయోత్సవాలకు రండి..తమిళనాట సాంప్రదాయం నెలకొల్పుదామంటున్నారు. అయితే సీఎం వైఖరి నోటితో నవ్వి నొసలుతో ఎక్కిరించినట్లు ఉందంటోంది బీఆర్ఎస్. ఓవైపు రెచ్చగొట్టుకుంటూ ఇంకో వైపు నీతులు చెప్తున్నారంటూ మండిపడుతోంది. విజయోత్సవాల జోరులో కాంగ్రెస్‌.. పోరాటంలో గులాబీ దళం..తెలంగాణ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది.?

బీఆర్ఎస్‌ను బ్లేమ్‌ చేసే ప్రయత్నం స్టార్ట్..
తెలంగాణలో పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఓ వైపు ప్రజా విజయోత్సవాలతో సంబురాల జోష్‌లో కాంగ్రెస్ ఉంటే..ప్రజా సమస్యల మీద పోరు కొనసాగుతూనే ఉంటుందంటోంది బీఆర్ఎస్. సీఎ రేవంత్‌రెడ్డి ఓవైపు అరెస్టులు అంటూ రెచ్చగొడుతూనే ఇంకోవైపు ప్రవచనాలు చెప్తున్నారంటూ ఫైర్ అవుతోంది గులాబీదళం. ఉప్పు, నిప్పు అన్నట్లుగా కొనసాగుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం..సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌తో మరింత రంజుగా మారుతోంది. ప్రజా విజయోత్సవాల్లో పాల్గొనాలంటూ కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానిస్తున్నారు సీఎం రేవంత్. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కూడా ఇన్వైట్ చేస్తామంటున్నారు. ఇక్కడే రేవంత్ రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ను బ్లేమ్‌ చేసే ప్రయత్నం స్టార్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ అసెంబ్లీకి రారు.. ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు రేవంత్. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామంటున్నారు. పెద్దరికాన్ని నిలబెట్టుకోండి.. ప్రతిదీ అడ్డుకోవడం సరికాదంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

బ్లేమ్‌ గేమ్‌ పాలిటిక్స్‌ అర్థం కావడం లేదంటున్న అపోజిషన్..
ఏకంగా తమిళనాడు మాదిరి.. మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుదామంటూ పిలుపునిస్తున్నారు సీఎం రేవంత్‌. ఇదే సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం..ఆయనను కలిసేందుకు వెళ్లిన హరీశ్‌రావును కూడా అదుపులోకి తీసుకోవడం కొత్త చర్చకు దారి తీస్తోంది. సీఎం తీరు మీద బీఆర్‌ఎస్‌ ఫైర్ అవుతోంది. గురుకుల హాస్టళ్లలో పిల్లలకు సరిగ్గా తిండి పెట్టకుండా..రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా..ఏం నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలో ఆలోచించుకుండా బ్లేమ్‌ గేమ్‌ పాలిటిక్స్‌ ఏంటో అర్థం కావడం లేదంటోంది అపోజిషన్. సీఎం తప్పులన్ని తనదిక్కు పెట్టుకుని తమను కార్నర్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతోంది. ఎన్ని కేసులు పెట్టినా..అక్రమ అరెస్ట్‌లు చేసినా తమ పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుందంటోంది బీఆర్ఎస్.

ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడుతున్నారని ఆగ్రహం..
మాట్లాడితే కేసీఆర్ సభకు రావాలంటున్న రేవంత్..నిన్న మొన్నటి వరకు పబ్లిక్‌ మీటింగ్‌లలో మాట్లాడిన తీరును గుర్తుకు తెచ్చుకోవాలంటోంది బీఆర్ఎస్. బాధ్యతాయుతమైన సీఎం స్థాయిలో ఉండి అడ్డగోలుగా మాట్లాడటమే కాకుండా ఇప్పుడు ఏం తెల్వనట్లుగా అపోజిషన్‌ రోల్ పోషించాలి..సూచనలు ఇవ్వాలని నీతులు చెప్తున్నారని మండిపడుతోంది గులాబీ దళం. రేవంత్ ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడుతున్నారని..అసలు సీఎం హోదాకు తగ్గట్లుగానే వ్యవహరించడం లేదంటోంది. బహిరంగ సభల్లో రేవంత్ ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని.. అందుకే ఇప్పుడు కొంత రాగం అందుకున్నారని విమర్శిస్తోంది బీఆర్ఎస్.

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్‌ వాయిస్‌ మార్చేశారా?
ప్రతిపక్ష పాత్ర పోషించాలని రేవంత్‌ సూచించడం విడ్డూరంగా ఉందంటోంది బీఆర్ఎస్. మూసీ నుంచి లగచర్ల వరకు..విద్యార్థుల ఫుడ్ పాయిజన్‌ ఘటనల నుంచి రైతు సమస్యల వరకు తాము ప్రజల తరఫును పోరాడుతూ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామంటోంది గులాబీ పార్టీ. ఏ విషయంలో మీరు సలహాలు కోరితే ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని..దానికి తమను బద్నాం చేయడం ఎందుకంటోంది బీఆర్ఎస్. సమస్య ఎక్కడ ఉంటే తాము అక్కడ ఉంటున్నామని.. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్‌..వాయిస్‌ మార్చేశారని మండిపడుతోంది బీఆర్ఎస్.

డిసెంబర్ 9వరకు ప్రజా విజయోత్సవాలు జరగనున్నాయి. అదే రోజు సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. వీటికి బీఆర్ఎస్ నేతలను ఇన్వైట్ చేస్తామంటున్నారు రేవంత్. మరి కేసీఆర్‌తో సహా గులాబీ నేతలు..ప్రజా విజయోత్సవాలకు వెళ్తారా..లేక ఇలాగే పోరుబాటను కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి.

 

Also Read : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యత వారికేనన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు కీలక సూచన