Jeevan Reddy: కాంగ్రెస్‌కు గుడ్ బై? జీవన్‌రెడ్డి పార్టీ మార్పు వార్తలతో తీవ్ర ఆందోళనలో ఆ మంత్రి, ఎమ్మెల్యే? ఎందుకు
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలో ఉన్న పార్టీలోనే చేరి ఆయనకు చుక్కలు చూపించాలని అనుకుంటున్నారట. జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదంటే నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి బరిలోకి నిలిపేందుకు కారు పార్టీకి జీవన్ రెడ్డి లాంటి బలమైన నేత దొరికినట్లవుతుంది.
- Naveen
- Published On : March 17, 2026 / 12:21 AM IST
Jeevan Reddy Representative Image (Image Credit To Original Source)
- జీవన్‌రెడ్డి హస్తం పార్టీని వీడటం ఖాయమా?
- జీవన్‌రెడ్డి జంపింగ్ వార్తలతో అడ్లూరి, మేడిపల్లి టెన్షన్
- బుజ్జగిస్తున్నా ససేమీరా అంటున్న జీవన్ రెడ్డి..!
- కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా మారబోతున్న జీవన్ రెడ్డి.!
Jeevan Reddy: నిరసనలు, అసంతృప్తులు అయిపోయాయి. ఇక హస్తంకు హ్యాండ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట జీవన్‌రెడ్డి. ఆయన పార్టీ మారితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వచ్చే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంటే.. ఓ మంత్రి, మరో ఎమ్మెల్యేకు మాత్రం టెన్షన్ పట్టుకుందట. జీవన్‌రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్‌కు ప్లస్సా? మైనస్సా? జీవన్‌రెడ్డి జంప్ అవుతున్నారన్న వార్తలతో ఆందోళన చెందుతున్న ఆ ఇద్దరెవరు?
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి హస్తం పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారట. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కి ప్రయారిటీ ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిన్సియారిటీకి తగిన ప్రాధాన్యత కల్పించలేదనేది పెద్దాయన వెర్షన్. పార్టీ లైన్‌లోనే తాను వాస్తవాలు చెబుతుంటే ఎందుకు నెగిటివ్‌గా తీసుకుంటున్నారంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిలా అధిష్టానాన్ని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా జీవన్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయనేది కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా జరుగుతున్న చర్చ. ఇక పార్టీ కూడా జీవన్ రెడ్డిని లైట్ తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా పార్టీలో కొనసాగితే అసమర్థుడి కింద పడిపోతామనే భావనలో ఉన్నారట జీవన్ రెడ్డి. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారట.
40ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీతో జీవన్ రెడ్డికి అనుబంధం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్, వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పదవీ కాలం ముగియడంతో రెన్యూవల్ చేస్తారని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా..ఆయన మాటకు విలువ ఇవ్వడాన్ని సహించలేకపోతున్నారు జీవన్ రెడ్డి. దీంతో ఈ నెల 24 లేదా 25న బీఆర్ఎస్ లో చేరడానికి జీవన్‌రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కోటలు బద్దలుకొట్టాలంటే ఆయనతోనే సాధ్యం..
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలో ఉన్న పార్టీలోనే చేరి ఆయనకు చుక్కలు చూపించాలని అనుకుంటున్నారట. జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదంటే నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి బరిలోకి నిలిపేందుకు కారు పార్టీకి జీవన్ రెడ్డి లాంటి బలమైన నేత దొరికినట్లవుతుంది. ఇక జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కోటలు బద్దలుకొట్టాలంటే..జీవన్ రెడ్డితోనే సాధ్యమవుతుందనేది జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్‌తో జీవన్‌రెడ్డి మంతనాలు జరిపినట్లు పొలిటికల్ సర్కిల్స్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
తమ ఇద్దరి పొలిటికల్ కెరీర్ రిస్క్‌లో పడుతుందనే ఆందోళన..
జీవన్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం అయన శిష్యులకు టెన్షన్ పుట్టిస్తోందట. పెద్దాయన కాంగ్రెస్‌ను వీడితే తమ పొలిటికల్ కెరీర్‌పై ఎక్కడ ప్రభావం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారట ఆ ఇద్దరు. గత ఎన్నికల్లో ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంల గెలుపు కోసం జీవన్ రెడ్డి పనిచేశారు. పార్టీ మారితే..ప్రతిపక్ష నేతగా రాబోయే ఎన్నికల్లో ఆ ఇద్దరి ఓటమికి జీవన్‌రెడ్డి పని చేయాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు ఆ శిష్యులను ఆందోళనకు గురిచేస్తుందని.. వారి పొలిటికల్ కెరీర్ రిస్క్‌లో పడే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. అందుకే తమ పొలిటికల్ ఫ్యూచర్‌పై అలర్ట్ అయిన అడ్లూరి, మేడిపల్లి సత్యంలు పార్టీ మారకుండా జీవన్‌రెడ్డిని బుజ్జగిస్తున్నారట. అయినా ఆయన ససేమీరా అంటున్నారని తెలుస్తోంది.
అయితే జీవన్ రెడ్డిని అధిష్టానం పట్టించుకోవడం లేదనేది ఆయన అనుచరులకు ఎప్పుడో బోధపడిందట. ఇంకా ఎంతకాలం అనువుగాని చోట ఉండాలనే ప్రశ్నలు జీవన్ రెడ్డిని నిలకడగా ఉండనివ్వడం లేదట. అందుకే పార్టీ మార్పే అన్నింటికి ముగింపు అనే నిర్ణయానికి వచ్చారట. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్తే మాత్రం జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు తథ్యమనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు జీవన్ రెడ్డి కారెక్కుతారా? అదే జరిగితే అడ్లూరి, మేడిపల్లి పరిస్థితి ఏంటి? వాళ్లు తమ రాజకీయ గురువును టార్గెట్ చేస్తారా? జీవన్‌రెడ్డి తన శిష్యులపై విమర్శల దాడికి దిగుతారా? లేదా వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఎటువైపు నిలుస్తారన్నది చూడాలి.
