×
Ad

తెలంగాణ గట్టుపై మళ్లీ విగ్రహాల వివాదం.. ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు కారణం అదేనా?

ఒకప్పుడు తెలంగాణ అంశంపై పూర్తి పేటెంట్‌గా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎస్పీబీ విగ్రహా ఏర్పాటుపై పెద్దగా స్పందించడం లేదు. ఇక తెలంగాణలో మరో కీలక పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఇష్యూ తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటుంది.

SP Balu Statue Row: తెలంగాణ అంటేనే సెంటిమెంట్‌. అలాంటిది హైదరాబాద్‌ గడ్డపై ఇక్కడి ప్రముఖుల విగ్రహాలే ఉండాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ట్యాంక్‌ బండ్‌పై ఉన్న స్టాచ్యూస్‌ను కూడా తొలగించాలన్న డిమాండ్‌ కూడా పాతదే. రోశయ్య విగ్రహం ఆవిష్కరించినప్పుడు కూడా ఇష్యూ అయింది. అయితే మరో ప్రముఖుడి విగ్రహం చుట్టూ రచ్చ నడుస్తోంది. తెలంగాణ పదం ఉచ్చరించడానికే ఇష్టపడని వ్యక్తి విగ్రహాన్ని..హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రాంగణంలో ఎలా పెడుతారంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. విగ్రహం వివాదంపై సర్కార్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ల విగ్రహాలా?

తెలంగాణ గట్టుపై విగ్రహాల వివాదం మళ్లీ చర్చకు వస్తోంది. రవీంద్రభారతి ఆవరణలో దివంగత ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం నడుస్తోంది. ఇప్పటికే లక్డీకాపూల్‌లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహం ఆవిష్కరించినప్పుడే తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు రవీంద్రభారతి ఆవరణలో సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి.

ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రోశయ్య, ఎన్టీఆర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముగ్గురు ఆంధ్రా ప్రాంతానికే వ్యక్తులే కావడం.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ల విగ్రహాలు ఏర్పాటు చేయడమేంటన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు..తెలంగాణ వాదులుగా పలు అంశాలపై స్పందిస్తున్న వారు..ఎస్పీబీ విగ్రహా ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

విగ్రహాల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నా.. ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఒకప్పుడు తెలంగాణ అంశంపై పూర్తి పేటెంట్‌గా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎస్పీబీ విగ్రహా ఏర్పాటుపై పెద్దగా స్పందించడం లేదు. ఇక తెలంగాణలో మరో కీలక పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఇష్యూ తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటుంది. ఇక కమ్యూనిస్టులు కానీ ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా రియాక్ట్‌ కావడం లేదు.

అయితే ప్రధాన రాజకీయ పార్టీలు సైలెంట్‌గా ఉండటానికి మెయిన్ రీజన్ క్యాస్ట్ ఈక్వేషనే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మూడు విగ్రహాలు మూడు కీలక సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులవి కావడంతో ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్నదే పార్టీలను టెన్షన్ పెడుతోందట.
ఓటు పాలిటిక్స్‌లో భాగంగా తెలంగాణకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాల ఏర్పాటుపై.. ప్రధాన రాజకీయ పార్టీలు సైలెంట్‌గా ఉంటున్నాయట.

అయితే రాజకీయాలకు సంబంధం లేని కామన్ మ్యాన్ మాత్రం తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చర్చకు పెడుతున్నారు. ఏకంగా రవీంద్రభారతి ఆవరణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ పనులు జరుగుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ వాది పృథ్వీరాజ్.

శుభలేఖ సుధాకర్‌, పృథ్వీరాజ్ మధ్య వాదన కూడా జరిగింది. తెలంగాణ గడ్డపై గద్దర్, ప్రముఖ కవి అందెశ్రీ వంటి వారికి ముందు గౌరవం దక్కాలని..బయటి వ్యక్తులకు ఇక్కడ విగ్రహాలు పెడితే ఊరుకునేది లేదంటున్నారు పృథ్వీరాజ్. పైగా తెలంగాణ పదం ఉచ్చరించడానికి..తెలంగాణ గీతం పాడేందుకు కూడా ఒప్పుకోని ఎస్పీ బాలు విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఎలా పెడుతారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో బాలు విగ్రహం చుట్టూ వివాదం నడుస్తోంది. ఈ డిసెంబర్‌ 15న ఎస్పీబీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందా..? లేదా..? అన్నది చూడాలి.

Also Read: ఆ కోవర్టు ఎవరు..! అధికారా? ప్రజాప్రతినిధా? హిల్ట్ పాలసీ లీక్ పై సీఎం రేవంత్ సీరియస్..