Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా?.. ఇంటి కోసం ఎదురుచూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల 500 చొప్పున ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Indiramma housing scheme

Indiramma Housing Scheme : మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా.. ఇంటి కోసం ఎదురుచూస్తున్నారా.. మీకో గుడ్ న్యూస్.. ఉగాది రోజున ఇళ్ల నిర్మాణానికి పునాది రాయి పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం బడ్జెట్ లో భారీగా నిధులను (రూ.12,571 కోట్లు) కేటాయించింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్లకు రూ.9,184 కోట్లు కేటాయించారు. ఈసారి ఆ మొతాన్ని మరింత పెంచారు. గతంకంటే రూ.3,387 కోట్లు అదనంగా నిధులిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 72వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. జనవరి 26న కొంతమందికి మంజూరు పత్రాలు కూడా ఇచ్చారు. రెండో విడత కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. నిర్దేశిత సమయంలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. వారికి ఇళ్లను కేటాయించాలని, సాధ్యమైనంత త్వరలోనే నిర్మాణాలు సైతం మొదలు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

Also Read : పాదయాత్రకు కేటీఆర్ ప్లాన్ చేసింది అందుకేనా?

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల 500 చొప్పున ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్లలో 22.50 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న ప్రభుత్వం.. ప్రతి ఏటా నిర్దేశిత ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగిచాలని యోచిస్తోంది. గరిష్టంగా మూడు నెలల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.

Also Read : సైబర్ టెర్రరిస్టుల కన్నా తక్కువేమీ కాదు..! బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ ఫ్లుయన్సర్లపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు

ముందుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టాలని, అందుకోసం హడ్కో నిధులను రాబట్టాలని ఇటీవల ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 82 లక్షల దరఖాస్తుల పరిశీలనకు కార్యాచరణ రూపొందించింది.