Good News For Junior Doctors
Good News For Junior Doctors : తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్లకు 15శాతం స్టైఫండ్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉత్తర్వులు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు ఉంచిన జూడాలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు. కరోనా సోకిన సిబ్బందికి నిమ్స్ లో వైద్యం అందించాలని, కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జూడాలు డిమాండ్లు చేస్తున్నారు.
తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన జూనియర్ డాక్టర్ల అంశంపై తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు వారికి గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్ల విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సానుకూలంగా స్పందించారు. హౌస్ సర్జన్, పీజీ, ఇంటర్న్ షిప్ చేస్తున్న వాళ్ల స్టైఫండ్ 15 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను ఈ రోజే విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తమ డిమాండ్లను అంగీకరించకపోతే సమ్మె తప్పదని జూడాలు తెలంగాణ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. రెండు వారాల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15 శాతం జీతం పెంచాలని, 10 శాతం ఇన్సెంటివ్స్ చెల్లించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి నెలకొంది. అయితే వారి డిమాండ్ల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో జూనియర్ డాక్టర్ల సమ్మెను నివారించినట్టయ్యింది.
స్టైఫండ్లు ఇలా…
మెడికల్, డెంటల్ హౌస్సర్జన్లకు ఇక నుంచి నెలకు రూ.22,527 వస్తుంది. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ ఫస్టియర్ వారికి నెలకు రూ.50,686 స్టయిఫండ్ ఇస్తారు. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ సెకండియర్ వారికి రూ. 53,503… పీజీ డిగ్రీ, ఎండీఎస్ థర్డియర్ వారికి రూ.56,319 ఇస్తారు. సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం వారికి రూ. 56319, రెండో ఏడాది వారికి రూ.59135, మూడో సంవత్సరం వారికి రూ.61949 స్టైఫండ్ రానుంది.
హౌస్ సర్జన్ మెడికల్ కు గతంలో రూ.19,589 స్టైఫండ్ వస్తుండగా.. తాజా ఉత్వర్వులతో వారికి రూ.22,527 స్టైఫండ్ రానుంది. హౌస్ సర్జన్ డెంటల్ కు గతంలో రూ.19,589 స్టైఫండ్ వస్తుండగా.. తాజా ఉత్వర్వులతో వారికి రూ.22,527 స్టైఫండ్ రానుంది.
పీజీ డిగ్రీ గతంలో ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ 44075 50686
సెకండ్ ఇయర్ 46524 53503
ఫైనల్ ఇయర్ 48973 56319
పీజీ డిప్లమో గతంలో ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ 44075 50686
సెకండ్ ఇయర్ 46524 53503
సూపర్ స్పెషాలటీ గతంలో ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ 48973 56319
సెకండ్ ఇయర్ 51422 59135
థర్డ్ ఇయర్ 53869 61949
ఎమ్.డి.ఎస్ గతంలో ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ 44075 50686
సెకండ్ ఇయర్ 46524 53503
థర్డ్ ఇయర్ 48973 56319