Ration Cards : పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు, దేశంలోనే తొలిసారిగా

Ration Cards : రాష్ట్రంలో ప్రస్తుతం 90లక్షల 14వేల 263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందించాలనే సంకల్పంతో రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయనున్నారు.

Ration Cards

Ration Cards – Telangana : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం కలగనుంది. దసరా నాటికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికీ ఉన్న నకిలీ రేషన్ కార్డులను తొలగించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా డిజిటల్ రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం.

నకిలీలకు చెక్.. డిజిటల్ రేషన్ కార్డులు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. నిజానికి మూడేళ్ల క్రితమే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చూసినా.. నకిలీ ఏరివేత సవాల్ గా మారడంతో ఇప్పటిదాకా అది వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఈసారి డిజిటల్ రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.

Also Read..KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్

ప్రస్తుతం 90లక్షల రేషన్ కార్డులు..
రాష్ట్రంలో ప్రస్తుతం 90లక్షల 14వేల 263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన కార్డుల్లోని యూనిట్లలో కుటుంబసభ్యుల సంఖ్య 2కోట్ల 83లక్షలు. ఈ లెక్కన తెలంగాణ జనాభాలో మూడింట రెండొంతుల జనాభాకు రేషన్ కార్డులు ఉన్నాయి. దీనిపై చాలా రోజుల నుంచి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే, వీళ్లలో అనర్హుల ఏరివేత రాజకీయ ఇబ్బందులకు కారణం అవుతుండటంతో వాటి తొలగింపు మొదలు పెట్టలేదు.

Also Read..KCR: సీఎం కేసీఆర్.. మహారాష్ట్రపై ఎందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టారంటే..!

అనర్హులకు, నకిలీలకు ఇలా చెక్..
కానీ ఇప్పుడు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్, కేంద్రం సహకారంతో త్వరలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది తెలంగాణ సర్కార్. నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టేలా దేశంలోనే తొలిసారి రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయబోతోంది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా రేషన్ కార్డులను ఆధార్ కు లింక్ చేయనున్నారు. దాంతో అనర్హులకు, నకిలీ కార్డులకు బ్రేక్ పడుతుంది.

రాష్ట్రంలో నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందించాలనే సంకల్పంతో రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయనున్నారు. ఫలితంగా పూర్తి పారదర్శకతతో దసరా నాటికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది సర్కార్. ఇందుకోసం ఇప్పటి నుంచే అధికారులు గ్రౌండ్ లెవెల్ లో కసరత్తు మొదలు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు