Cm Revanth Reddy
New Schemes: తెలంగాణలో మరో రెండు కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. మైనార్టీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథ, అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.
ఇక రెండో స్కీమ్ ‘రేవంతన్న కా సహారా – మిస్కీనో కేలియే’. ఈ పథకం కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు లక్ష రూపాయల ఖరీదు చేసే మోపెడ్ వాహనాలు ఇవ్వనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ రెండు పథకాలను సచివాలయంలో ప్రారంభించారు. ఈ రెండు స్కీమ్ కు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పోర్టల్ ను మంత్రి లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ రెండు స్కీమ్స్ కోసం సర్కార్ 30 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ ద్వారా మహిళల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
ఈ రెండు పథకాలకు అప్లయ్ చేసుకునే వారు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో అప్లయ్ చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని మంత్రి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ స్కీమ్స్ ను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ రెండు పథకాలు మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి పునాది అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తామని మంత్రి లక్ష్మణ్ వెల్లడించారు. ఈ రెండు పథకాలు మైనార్టీల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయన్నారు.
ఈ రెండు పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ మహిళా యోజన తోడ్పడుతుందన్నారు. ఫకీర్, దూదేకుల వర్గాల వారికి మోపెడ్స్ ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. ఈ రెండు పథకాల కోసం ప్రభుత్వం 30 కోట్లు కేటాయించడం అంటే.. మైనార్టీల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అంకిత భావానికి నిదర్శనం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు.