Farmers Compensation: తెలంగాణలోని రైతులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ప్రభుత్వం. గత రెండు నెలలుగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం నిధులను విడుదల చేసింది. 2 నెలల్లో 29 జిల్లాల్లో 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 41,361 మంది రైతులకు సంబంధించి
రూ.51.528 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, పత్తి 4753 ఎకరాలు, ఇతర పంటలు 477 ఎకరాలలో నష్టం జరిగింది.
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికి అందాల్సిన పంట నీటి పాలైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ క్రమంలో పంట నష్టపోయిన అన్నదాతలకు రేవంత్ ప్రభుత్వం అండగా నిలిచింది. రైతులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంట నష్ట పరిహారం నిధులను రిలీజ్ చేసింది.
ఇటీవల అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఈ అంచనా నివేదిక ప్రకారం రూ.51.528 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇక, మే నెలలో జరిగిన నష్టంపైనా అధికారులు నివేదిక సమర్పించగా.. ఇందుకు సంబంధించి పంట నష్టపరిహారం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
ప్రభుత్వం ఏకకాలంలో పంటల సేకరణ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మే నెలలో అదనపు పంట నష్టాన్ని అంచనా వేయడానికి కొత్త సర్వేను కూడా ప్రారంభించింది. ఈ ఇటీవలి కాలానికి సంబంధించిన నివేదిక ఇప్పటికే సమర్పించబడింది. అవసరమైన నిధులు త్వరలో మంజూరు చేయబడతాయని మంత్రి తుమ్మల ధృవీకరించారు.
జిల్లాల వారీగా పరిహారం వివరాలు :
సిద్దిపేట: రూ. 6.14 కోట్లు (4,913 మంది రైతులు)
ములుగు: రూ. 5.73 కోట్లు (2,933 మంది రైతులు)
జగిత్యాల: రూ. 5.45 కోట్లు (5,099 మంది రైతులు)
మంచిర్యాల: రూ. 4.60 కోట్లు (3,017 మంది రైతులు)
మహబూబ్ నగర్: రూ. 4.00 కోట్లు (3,888 మంది రైతులు)
రైతులకు మద్దతివ్వడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే వ్యవసాయ ఇబ్బందులను తగ్గించడంలో ప్రభుత్వం నిరంతర నిబద్ధతలో ఈ ఆర్థిక సాయం ఒక ముఖ్యమైన అడుగు అని అధికారిక ప్రకటనలో తెలిపింది.
Also Read: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు..