MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు..
క్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచి రూ.2,369గా నిర్ణయించింది.

MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడిపై 50శాతం లాభం ఉండేలా ధరలు పెంచింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు కోసం రూ.2.70 లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. క్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచి రూ.2,369గా నిర్ణయించింది.
2025-26 ఖరీఫ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) ఆమోదించిన కేంద్ర కేబినెట్..
వరి సాధారణ, గ్రేడ్ ఏకి క్వింటా రూ.69 పెంపు
జొన్నలు క్వింటా రూ. 328 పెంపు
సజ్జలు క్వింటా రూ.150 పెంపు
రాగులు క్వింటా రూ.596 పెంపు
మొక్కజొన్న క్వింటా రూ.175 పెంపు
కందిపప్పు క్వింటా రూ.450 పెంపు
పెసర్లు క్వింటా రూ.86 పెంపు
Also Read: అమెరికాలోని భారతీయ విద్యార్థులకు ఒకేసారి రెండు షాకులు ఇచ్చిన ట్రంప్
మినుములు క్వింటా రూ.400 పెంపు
వేరుసెనగ క్వింటా రూ.480 పెంపు
పొద్దుతిరుగు క్వింటా రూ.441 పెంపు
సోయాబీన్ క్వింటా రూ.436 పెంపు
కుసుములు క్వింటా రూ.579 పెంపు
ఒలిసెలు క్వింటా రూ.820 పెంపు
పత్తి క్వింటా రూ.589 పెంపు
సగటు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర పెంపు.