Bhadrachalam Temple
Bhadrachalam Temple : రాముడు నడయాడిన భద్రాద్రి కొత్త శోభను సంతరించుకోనుంది. దక్షిణ అయోధ్య భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. టెంపుల్ సిటీగా భద్రాద్రి రామాలయం పనులు వేగంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన భూసేకరణకు కాంగ్రెస్ సర్కాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో భద్రాద్రి అభివృద్ధికి సీఎం రేవంత్ అంగీకారం తెలిపారు. భూసేకరణ కోసం ప్రభుత్వం 34 కోట్లు విడుదల చేసింది.
శ్రీరామ నవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి పూనుకుంది. భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూసేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి ఆలయ భూసేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read : వసంత నవరాత్రులు చేయలేని వారు ఇలా చేయండి చాలు..
సీఎం ఆదేశాలతో 34 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రామనవమి సందర్భంగా దక్షిణ అయోధ్య టెంపుల్ సిటీకి అడుగులు పడుతున్నాయి.
భారత దేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ సమస్యను ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపారు. భూసేకరణ అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read : ఉగాది నుంచే వసంత నవరాత్రులు.. కలశ స్థాపన అందరూ చేయొచ్చా.. ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి?
దక్షిణ అయోధ్యగా భద్రాద్రి ఆలయ కీర్తి ధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాడవీధుల విస్తరణ, ఇతర పనుల కోసం ప్రభుత్వం ఇటీవలే 80 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. మాడవీధుల విస్తరణలో భాగంగా ఇళ్లు, భూములను కోల్పోతున్న వారిని రెవెన్యూ, దేవస్థానం అధికారులు గుర్తించారు. నిర్వాసితులకు అధికారులు పరిహారం అందించనున్నారు.