Vasanta Navaratrulu : ఉగాది నుంచే వసంత నవరాత్రులు.. కలశ స్థాపన అందరూ చేయొచ్చా.. ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి?

అమ్మవారి సహస్ర నామాలతో వసంత నవరాత్రుల్లో ఆరాధించాలి.

Vasanta Navaratrulu : ఉగాది నుంచే వసంత నవరాత్రులు.. కలశ స్థాపన అందరూ చేయొచ్చా.. ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి?

Updated On : March 30, 2025 / 6:20 PM IST

Vasanta Navaratrulu : ఉగాది నుంచే వసంత నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. వసంత నవరాత్రులను ఎలా జరుపుకోవాలి, పూజా విధానం ఏంటి, కలశ స్థాపన అందరూ చేయొచ్చా.. ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి? ఆధ్యాత్మికవేత్తలు ఏం చెబుతున్నారు..

”వసంత నవ రాత్రులు అనేసరికి అందరూ లలితాదేవి ఆరాధన మాత్రమే చేస్తారు. లలితా దేవి ఆరాధన లేని వారు, వైష్ణవ సాంప్రదాయకులు రామాయణ సేవా కాలం చేస్తారు. రామచంద్రుడు పుట్టబోయే కాలం కాబట్టి రామ చంద్రుడి అనేక ఘట్టాలు ఈ 9 రోజుల్లోనే ఎక్కువగా జరిగాయి. బాల చంద్రుడికి ఒక నూలుపోగు అని చెప్పి విధియ నాడు పాడ్యమి నాడు మొదలు పెట్టుకుని కలశ స్థాపన చేసుకోవాలి( కలశ స్థాపన ఉంటేనే చేయాలి). కలశ స్థాపన లేదు అంటే చక్కగా అమ్మవారి పటం పెట్టుకుని ఆరాధన చేయాలి.

లలితా దేవి ఆరాధాన చేయాలంటే పూర్తి నియమ నిష్టలతో ఆరాధన చేయాలి. మన ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే ఒక పూట ఉపవాసంతో అమ్మవారికి నివేదన చేయాలి. అమ్మవారికి ఏది పెడతామో అది మనం స్వీకరించాలి. అమ్మవారి సహస్ర నామాలతో వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించాలి. వసంత నవరాత్రిలో అమ్మవారిని ఆరాధన చేస్తే లలితా దేవి చాలా ప్రీతి చెందుతారు. పార్వతీ దేవి భూమి మీదకు వచ్చి తపస్సు చేసినప్పుడు పరమ శివుడిని పొందింది ఈ నవరాత్రుల్లోనే.

రామచంద్రుడికి చేయకపోతే చంద్రుడికి నూలుపోగు అని వ్రతం చేస్తారు. పత్తితో చేసిన ఒక వస్త్రాన్ని సమర్పిస్తారు. అదే రామచంద్రుడిని పెట్టుకుంటే ఆయనకు వస్త్ర సమర్పణ చేస్తారు. అదే లలితా దేవి అయితే ఆవిడకు ఒక చీర పెడతారు. అలా విడివిడిగా ఆరాధన చేస్తారు. తదియ నాడు వచ్చే సరికి గౌరీ వ్రతం చేస్తాం. చవితి చతుర్ధి నాడు వచ్చేసరికి లలితా దేవికి, పరమేశ్వరికి సంబంధించి వ్రతాన్ని ఆచరిస్తారు.

లలితా దేవి శక్తి స్వరూపిణి. నవరాత్రులు అంటే మనం శక్తిని కూడగట్టుకోవడానికి ఆ శక్తిని ఆహ్వానం చేసుకుని శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని కానీ పార్వతీ దేవిని కానీ, సర్వస్వతి దేవిని కానీ, అన్ని రూపాలను కలిగిన లలితా దేవిని ఆరాధన చేస్తారు. పంచమి నాడు మహాలక్ష్మి ఆరాధన చేస్తారు. నాగుల ఆరాధన చేస్తారు. షష్టి నాడు సుబ్రమణ్యస్వామి ఆరాధన చేస్తారు.

Also Read : పంచాంగాన్ని ఎందుకు వినాలి? విశ్వావసు నామ సంవత్సరం అనే పేరు ఎలా వచ్చింది?

నవమి నాడు వచ్చేసరికి సీతారాముల కల్యాణం చేస్తారు. వైష్ణవులు ఈ 9 రోజులు పారాయణం చేస్తారు. గర్భ నవరాత్రులు అని చెప్పి రామాయణ పారాయణం చేసి 9వ రోజున పట్టాభిషేకము, రామ కల్యాణము నిర్వహిస్తారు. ఇవన్నీ వీలు అవ్వలేదు అంటే అష్టమి నాడు కానీ సప్తమి నాడు కానీ లేకపోతే నవమి నాడు కానీ పట్టాభిషేక పారాయణ సర్గని చదివినా, విన్నా మనకి పట్టాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. ఆ సర్గని చదవడమో, వినడమో మనకి నవ విధ భక్తి మార్గాలు” అని ఆధ్యాత్మికవేత్త శ్రీ దివ్య రమణ చక్రవర్తుల తెలిపారు.

కలశ స్థాపన ఎవరు చేసుకోవాలి? ఎలా చేయాలి?
”నవ రాత్రులు పూజలు చేయలేని వారు ఆఖరి మూడు రోజులు చేయొచ్చు. సప్తమి, అష్టమి, నవమి.. ఈ మూడు రోజులు నవరాత్రులు చేయొచ్చు. 5 రోజులు కూడా చేయొచ్చు. లేదంటే ఆఖరి రోజు చేయొచ్చు. మొత్తం కుదరలేదు అంటే దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరి ఇంట్లో అయినా పురుషులు కనుక లలితా సహస్ర పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ లోటు ఉండదు.

స్త్రీల కన్నా పురుషులు లలితా పారాయణం చేస్తే ఆ ఇంట్లో దేనికీ లోటు ఉండదు. వారి ఇంట్లో పుష్కలమైన సంపద ఉంటుంది. లలితా దేవి ఆరాధన మగవారు చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి. ఎప్పుడూ కూడా బ్రహ్మ ముహూర్తం శ్రేయస్కరం. అది ఏ తిథి అయినా, ఏ నక్షత్రం అయినా, ఏ రోజు అయినా.. కనీసం సూర్యోదయ కాలం అంటే పొద్దునే చేసినా చాలు. 10, 11, 12 గంటలకి పూజ అంటే రాక్షస పూజ అయిపోతుంది. ఒకవేళ పనులన్నీ చేసుకోవాలి అనుకుంటే ముందుగా దీపం పెట్టేయాలి.

కలశ స్థాపన చాలా మంది 9 రోజులు పెట్టుకుంటారు. ఎవరికి ఉంటుందో వారే పెట్టుకుంటారు. ఒకసారి నవరాత్రికి కలశస్థాపం చేశామంటే ఇక ప్రతి నవరాత్రికి కలశ స్థాపన చేయాలి. ఆరాధనలను బట్టి కలశంలో వేసే ద్రవ్యాలు మారుతుంటాయి. కలశం అంటే గంగాజలం. కలశ స్థాపన చేసుకున్నప్పుడు నీరు, పసుపు, కుంకుమ, గంధం, పంచ పల్లవాలు.. ఇవన్నీ వేసి ఒక పుష్పాన్ని వేసి.. ఆ నీటిపై కొబ్బరి బొండం పెట్టాలి. దానికి చక్కటి జాకెట్ వస్త్రం ఎర్రది లేదా పసుపు రంగుది పెట్టాలి.

ఒక పీటపై అష్టదళ పద్మం వేసి దాని మీద బియ్యం పోసి జాకెట్ వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశస్థాపన చేసి అమ్మవారిని ఆహ్వానం చేసుకుంటాం. కలశ స్థాపనే మాకు లేదు అంటే మామూలుగా పీట వేసుకుని, పీట మీద అష్టదళ పద్మం, దాని మీద జాకెట్ వస్త్రం (ఎరుపు లేదా పసుపు లేకా ఆకుపచ్చ) ఉంచాలి. ఒక్కో రంగు ఒక్కోదానిక ప్రతీక. జీవితం అంతా పచ్చదనం కావాలి అనుకునే వారు పచ్చది వేసుకోవాలి. సౌభాగ్యంతో నిండి ఉండాలి అనుకునే వారు పసుపు రంగు, సంపదలు కావాలి, సుఖంగా ఉండాలి అనుకునే వారు ఎరుపు రంగు వేసుకోవాలి. పటం పెట్టుకోవాలి. పటం లేకపోతే విగ్రహం పెట్టుకోవచ్చు. లలితా పరమేశ్వరిని ఆహ్వానం చేసుకోవాలి.

అమ్మవారికి సింహాసనం ఏర్పాటు చేయాలి. అమ్మవారిని దాని మీద వేయించేసుకుని ఆహ్వానం చేసి ఆరాధన చేయాలి. అఖండ దీపారాధన పెట్టినప్పుడు 9 రోజులు దీపం వెలుగుతూ ఉండాలి. ఈ దీపం మధ్యలో ఆగిపోతే అరిష్టానికి సంకేతం. 9 రోజులు దీక్షగా పెట్టిన దీపాలు ఆరిపోతే ఆ కాలంలో ఏదో ఒక అరిష్టం రాబోతోంది. మేము రాత్రి పూట దీపం చూడలేము అనుకునే వాళ్లు నిత్యదీపారాధన ఉత్తమం. నిత్య దీపారాధన చేసుకుని అమ్మవారిని ఆరాధన చేసినా అదే ఫలితం దక్కుతుంది. అఖండ దీపారాధన చేసినా అదే ఫలితం దక్కుతుంది.

ఆఖండ దీపారాధనలో నిత్యం భయపడుతూ ఉంటారు. అందుకే దానికన్నా నిత్య దీపారాధన చేసుకుందాం. దీనికి విశేషమైన ఫలితం ఉంటుంది. అఖండ దీపారాధన ఆలోచించే చేయాలి. అఖం దీపారాధనకు మట్టి పాత్రలు శ్రేష్టం. మట్టి పాత్రలను తీసుకెళ్లి తర్వాత నీళ్లలో వదిలేయాలి. పొద్దున సాయంత్రం లలితా దేవి సహస్ర పారాయణం చేయాలి” అని ఆధ్యాత్మికవేత్త శ్రీ దివ్య రమణ చక్రవర్తుల తెలిపారు.