RS Praveen Kumar: ప్రభుత్వాలు నా ఐ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నాయి.. యాపిల్ సంస్థ తెలిపింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

‘‘ప్రభుత్వాలు నా ఐ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని యాపిల్ సంస్థ నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను. కానీ, మీ దోపిడీ-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా.. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ’’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

RS Praveen Kumar

RS Praveen Kumar: ప్రభుత్వాలు తన ఐ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నాయని బీఎస్పీ తెలంగాణ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. అయినప్పటికీ తాను తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు. ‘‘ప్రభుత్వాలు నా ఐ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని యాపిల్ సంస్థ నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను. కానీ, మీ దోపిడీ-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా.. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ..’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఐ ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ యాపిల్ సంస్థ తనకు పంపిన హెచ్చరికను ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. రాష్ట్ర సహకారం ఉన్న హ్యాకర్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐ ఫోన్ ను లక్ష్యంగా చేసుకున్నారంటూ అందులో ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నారు? ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారన్న విషయాన్ని పసిగట్టేందుకు హ్యాకర్లు ఈ ప్రయత్నాలు జరుపుతుండొచ్చని యాపిల్ సంస్థ పేర్కొన్నట్లు అందులో ఉంది.

Stampede In Guntur: చంద్రబాబు సభలో మరోసారి కలకలం… తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి