Telangana Budget Sessions 2024
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవి తొలి బడ్జెట్ సమావేశాలు ఇవే. నీటి ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు తీసుకురానుంది. కాంగ్రెస్ సర్కార్ ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించనుందని ఆసక్తి నెలకొంది.
గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తూ.. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయనుందని తెలిపారు. ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిందని అన్నారు. మరో రెండు హామీలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారని తెలిపారు.
ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రజాభవన్ లోకి సామాన్యులను అనుమతి ఇస్తుందని గవర్నర్ తెలిపారు. ప్రజాపాలనలో 1.2 కోట్ల దరఖాస్తులను స్వీకరించిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కలిసివచ్చిన వ్యక్తులు, పార్టీలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని చెప్పారు. యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు.
తెలంగాణ ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని గవర్నర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన పాత్రను స్మరించుకుంటుందన్నారు. ఇటీవలే దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిలాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని గవర్నర్ చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కుటుంబాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.