Graduate MLC Bypoll : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్

ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరిగింది. 

Graduate MLC Bypoll : ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే లైనులో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరిగింది.

మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. లోక్ సభ, శాసనసభ ఎన్నికలవలే కాకుండా ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించారు. ఇదిలాఉంటే.. నల్గొండలోని డైట్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఆర్వో, కలెక్టర్ హరి చందన దాసరి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Also Read : నేను చెప్పింది వాస్తవమే.. సోమవారం వివరాలు వెల్లడిస్తా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలవగా. ప్రస్తుతం ఉన్న 12 జిల్లాలు (మూడు ఉమ్మడి జిల్లాలు) 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,87,007 మంది, మహిళా ఓటర్లు 1,74,794 మంది ఉన్నారు. ఈరోజు ఓటు హక్కు ఉన్నవారందరికీ వేతనంతో కూడిన సెలవును ఈసీ ప్రకటించింది. జూన్ 5వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Also Read : బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధుల మధ్య ప్రదాన పోటీ నెలకొంది. ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతుఇవ్వాలని పట్టభద్రులను కోరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నారు. వారు ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారాన్ని నిర్వహించడంతో వారు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

ట్రెండింగ్ వార్తలు