పెళ్లి తెచ్చిన తంటా.. 500 మందిలో కరోనా భయం

  • Publish Date - August 17, 2020 / 06:26 PM IST

పెళ్లి కొంపముంచింది.. 500 మందిలో కరోనా భయం పట్టుకుంది.. పెళ్లి కొడుకుకు కరోనా సోకడంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో కరోనా సోకిందేమనన్న భయాందోళన నెలకొంది. రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనాతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యేకించి శుభకార్యాల్లో 30-40 మందికి మించి ఉండకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.



అయినా పెళ్లిళ్ల సమయంలో కరోనా క్యారియర్స్‌గా మారుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. విశాఖ జిల్లాలో జరిగిన పెళ్లి కొంప ముంచింది. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి వేడుకలో 500 మందికి పైగా విందు ఏర్పాటు చేశారు.



పెళ్లి కుమారుడికి కరోనా సోకిందని తేలడంతో అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు పెళ్లికి వచ్చినవారంతా తమకు ఎక్కడ కరోనా సోకిందేమన్న భయమే ఎక్కువై పోయింది.. అనవసరం వెళ్లమంటూ లబోదిబోమంటున్నారు. ఇంతకీ కరోనా సోకినట్టా లేదా అనేది తేలియక గందరగోళ పరిస్థితుల్లో ఉండిపోయారు.



కొడవటిపూడి గ్రామానికి చెందిన ఓ యువకుడు.. 20 రోజుల కిందట రంగారెడ్డి జిల్లా నుంచి ఇంటికొచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఈనెల 5న పరీక్షలు నిర్వహించారు. టెస్టు ఫలితాలు రాకముందే అతడు పెళ్లికి రెడీ అయిపోయాడు.



రెండు రోజుల కింద పెళ్లి చేసుకున్నాడు. చర్చిలో జరిగిన ఈ పెళ్లికి 90 మంది హాజరయ్యారు. అదే మధ్యాహ్నం ఇంట్లో 500 మందికి భోజనాలు పెట్టారు.. ఇంతలో పెళ్లికొడుక్కి కరోనా అని తేలింది. పెళ్లిలో భోజనం చేసిన 590 మంది ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.