అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు

ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్వీకరించారు.

Harish Rao Versus CM Revanth Reddy: లోక్‌స‌భ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. తామిచ్చిన హామీలను అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. సీఎం సవాలుకు హరీశ్ రావు కూడా దీటుగా స్పందించారు. సీఎం సవాలును స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండి రాజకీయం చేస్తున్నారని, ఆయన చేసిన సవాలును తాను స్వీకరిస్తున్నట్టు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని.. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

Also Read: లోక్‌స‌భ‌ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి కొత్త మోసం మొదలెట్టారు: కేటీఆర్

ఈ విషయాలపై ఎల్లుండి అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద తనతో చర్చకు సీఎం రేవంత్ రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సీఎం రేవంత్ మంగళవారం హరీశ్ రావుకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు