74 ఏళ్లు ఉన్నప్పటికీ చంద్రబాబు బయట తిరుగుతుంటే.. 54 ఏళ్ల మన సీఎం రేవంత్ మాత్రం..: హరీశ్ రావు

ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలని, ఆపదలో ఉన్న వారిని కాపాడాలని హరీశ్ రావు అన్నారు.

వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేయకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమపై బురద చల్లుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఖమ్మం జిల్లాలో సమస్యలను తగ్గించడంలో ముగ్గురు మంత్రులూ విఫలమయ్యారని హరీశ్ రావు చెప్పారు. 74 సంవత్సరాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరదల వేళ బయట తిరుగుతుంటే, 54 ఏళ్లు ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంట్లోనే ఉన్నారని విమర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టలేదని అన్నారు.

16 మంది చనిపోయారని ప్రభుత్వం అంటోందని, తమ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని హరీశ్ రావు చెప్పారు. 31 మంది చనిపోయారని తమకు సమాచారం ఉందని తెలిపారు. ఖమ్మంలో తొమ్మిది సీట్లు ఇస్తే, తొమ్మిది మందిని కూడా కాపాడలేకపోయారని చెప్పారు.

ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలని, ఆపదలో ఉన్న వారిని కాపాడాలని హరీశ్ రావు అన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో సహాయం అడిగిన వరద బాధితులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

Also Read: ఈ విపత్కర పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణం- బుడమేరు వరదపై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు