Harish Rao Comments
కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రైతులను సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని చెప్పారు. ఇప్పటికే సమస్యల్లో ఉన్న రైతులకు పంట రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు లీగల్ నోటీసులు ఇస్తున్నారని అన్నారు.
రైతుకు ఎకరాకు రు. 25 వేలు ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతులను వేది స్తున్న బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు ఈ పరిస్థితుల్లో అప్పులు కట్టవద్దని అన్నారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించక పోతే లక్షలాదిమంది రైతులతో సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
బ్యాంకు అధికారులు రజాకార్లను తలపించేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రుణమాఫీపై సర్కారు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపిందని చెప్పారు. రైతులకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోవడం లేదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నేతల చేరికపైనే దృష్టి పెట్టాయని చెప్పారు.
వరంగల్ జిల్లాలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి పరిశీలించామని అన్నారు. చాలా మంది రైతులు బోర్లు వేసినా పంటలు ఎండి పోతున్నాయని తెలిపారు. గత పదేళ్లలో ఈ పరిస్థితి లేదని రైతులు చెప్పారని అన్నారు. ప్రభుత్వం నీటి నిర్వహణ సక్రమంగా లేక పోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.
Ex Mla Sugunamma : తిరుపతి టికెట్‌పై మరోసారి పునరాలోచించాలి? బయటి వ్యక్తులకు మద్దతు తెలపలేం