Raj Gopal Reddy: దుష్ప్రచారం చేస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక కామెంట్స్..
Raj Gopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతల పై కీలక కామెంట్స్ చేశారు.
Komatireddy Raj Gopal Reddy
Raj Gopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతల పై కీలక కామెంట్స్ చేశారు. నేను పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీల వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం చెరువును పరిశీలించి గంగ హారతిలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు 500కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. చౌటుప్పల్ చెరువు నుండి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరదనీరును డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని అన్నారు. తనపై కొందరు రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. పార్టీ మారుతున్నానని బయట పార్టీల వాళ్లతోపాటు సొంత పార్టీవారు కూడా దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Azharuddin : అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు.. ఎందుకంటే?
ప్రజలు ఈ దుష్ప్రచారాలను నమ్మొద్దని, నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్యేను. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పనిచేస్తాను. నా ముందు మునుగోడు అభివృద్ధి తప్ప మరొక ఆలోచన లేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
