Harish Rao: ఎంపీలకు భద్రత కరవైంది.. లోక్‌సభలో కలకలంపై హరీశ్ రావు

లోక్‌స‌భలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా...

Harish Rao

Parliament: లోక్‌స‌భ‌ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు అలజడి రేపిన విషయంపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. పార్లమెంట్లో జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ఎంపీలకే భద్రత కరవైందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు హరీశ్ రావు హాజరై మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరూ కష్టపడ్డారని చెప్పారు. నర్సాపూర్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేలా చేశారని అన్నారు. కష్టపడిన వారిని గుర్తు పెట్టుకుంటామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తామని చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీనేనని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ వారు గోబెల్స్ ప్రచారం చేశారని చెప్పారు. గెలుపు, ఓటములు సహజమని అన్నారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షమేనని హరీశ్ రావు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేలా పోరాటం చేస్తామని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.

Colour Gas Canisters: పార్లమెంట్‭లో హంగామాకు కారణమైన కలర్ గ్యాస్ కంటైనర్లు ఏంటో తెలుసా?