Colour Gas Canisters: పార్లమెంట్లో హంగామాకు కారణమైన కలర్ గ్యాస్ కన్సిస్టర్లు ఏంటో తెలుసా?
ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఆ యువకుడు ఒక బెంచీ మీద నుంచి మరో బెంచీకి దూకడం మొదలుపెట్టాడు. అనంతరం బీఎస్పీ ఎంపీ మలుక్ నగర్ ఆ యువకుడిని పట్టుకున్నారు

ఈరోజు (డిసెంబర్ 13) పాత పార్లమెంట్‌పై దాడి జరిగిన వార్షికోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకుంటుంది. 2001లో పాత పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి వార్షికోత్సవం సందర్భంగా కొత్త పార్లమెంట్‌లో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. బుధవారం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నార్త్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము లోక్‌సభలో మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ చైర్మన్ కుర్చీలో ఉన్నారు. అంతలో హఠాత్తుగా ప్రేక్షకుల గ్యాలరీ నుండి ఎవరో దూకుతున్న శబ్దం వచ్చింది.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ లోపల, బయట కలర్ గ్యాస్ కనిస్టర్లతో హంగామా చేసిన ఆ యువతి-యవకులు ఎవరు?
ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఆ యువకుడు ఒక బెంచీ మీద నుంచి మరో బెంచీకి దూకడం మొదలుపెట్టాడు. అనంతరం బీఎస్పీ ఎంపీ మలుక్ నగర్ ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న డబ్బాను తెరిచాడు, దాని నుండి పసుపు పొగ రావడం ప్రారంభమైంది. పార్లమెంటులో ఉత్కంఠ నెలకొంది. మరో వ్యక్తి సభ లోపలే ఈ గ్యాస్ వదిలాడు. ఇక దీనికి ముందు ట్రాన్స్ పోర్ట్ భవన్ ముందు కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఒక యువతి-యువకుడు నిరసన చేస్తూ కలర్ గ్యాస్ వదిలారు. ఈరోజు ఇంత ఉత్కంఠకు కారణమైన ఈ కలర్ గ్యాస్ ఏంటని చాలా మందికి ప్రశ్న రావొచ్చు. అందుకే అదేంటో తెలుసుకుందాం.
संसद परिसर में घुसे प्रदर्शनकारी की जमकर कुटाई करते तमाम दलों के माननीय सांसद गण.#Parliament #ParliamentAttack #ParliamentofIndia #ParliamentAttack2001 pic.twitter.com/OA7IE0s0Nm
— Shivam Pratap Singh (@journalistspsc) December 13, 2023
కలర్ గ్యాస్ కనిస్టర్స్ ఏమిటి?
స్మోక్ క్యాన్లు లేదంటే స్మోక్ బాంబ్స్ అని పిలిచే వీటిని చాలా దేశాల్లో లీగల్ గా ఉపయోగిస్తారు. పబ్లిక్ మార్కెట్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని మిలిటరీలో ఉపయోగిస్తారు. సాధారణ ప్రజల్లో కూడా వాడకం ఎక్కువే. ముఖ్యంగా ఫొటోషాపుల కోసం అయితే బాగానే వాడతారు. మిలిటరీ కార్యకలాపాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్యాస్ వెదజల్లి.. శత్రువులకు కనిపించకుండా రంగు మేఘాన్ని సృష్టించి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. మిలిటరీకి చెందిన కీలక ఆపరేషన్లలో వాడతారు. టార్గెట్ జోన్లలో ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి, ట్రూప్స్ ల్యాండ్ చేయడానికి, ఎవాక్యువేషన్ ప్రదేశాల్ని గుర్తించడానికి వినియోగిస్తారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. అసలేం జరిగింది? ఆగంతకులు ఏమని నినదించారు?
ఫోటోగ్రఫీలో ఈ కలర్ గ్యాస్ డబ్బాలను విరివిగా వాడతారు. ఒక భిన్నమైన వాతావరణం సృష్టించి భ్రమ కల్పించేందుకు వీటి వాడకం సర్వసాధారణం అయింది. క్రీడలలో.. ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు. ఐరోపా ఫుట్‌బాల్‌లో అభిమానుల క్లబ్‌లు లేదా ‘అల్ట్రా’లను తరచుగా పిలుస్తారు. ప్రత్యర్థి జట్లకు నిరుత్సాహ పరిచే వాతావరణాన్ని సృష్టించడానికి వీటిని ఉపయోగిస్తారు. అంటే తమ అభిమాన జట్టు రంగులను పెద్ద ఎత్తున ప్రదర్శిస్తారు.