Gas in Parliament: పార్లమెంట్ లోపల, బయట కలర్ గ్యాస్ కనిస్టర్లతో హంగామా చేసిన ఆ యువతి-యవకులు ఎవరు?

ట్రాన్స్‌పోర్ట్ భవన్ ముందు నిరసనకు దిగి గ్యాస్ స్ప్రే చేయడంతో పాటు 'భారత్ మాతాకీ జై', 'నియంతృత్వం పనిచేయదు' వంటి నినాదాలు చేశారు. ఈ నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Gas in Parliament: పార్లమెంట్ లోపల, బయట కలర్ గ్యాస్ కనిస్టర్లతో  హంగామా చేసిన ఆ యువతి-యవకులు ఎవరు?

Updated On : December 13, 2023 / 4:15 PM IST

22 ఏళ్ల క్రితం పార్లమెంట్ భవనం మీద ఉగ్రదాడి జరిగిన వార్షికోత్సవం సందర్భం పార్లమెంట్‌లో జీరో అవర్‌ చర్చ సాగుతోంది. ఇంతలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు యువకులు లోక్‌సభలోకి దూకి, టేబుళ్లపై పొగ చల్లి తీవ్ర దుమారం రేపారు. ఈ ఘటన జరగడానికి కొద్ది గంటల ముందు పార్లమెంట్ భవనం బయట ఉన్న ట్రాన్స్‌పోర్ట్ భవన్ ముందు దాదాపు అదే రకమైన గ్యాస్‌ను చల్లుతూ ఓ యువకుడు, మహిళ హంగామా సృష్టించారు. ప్రస్తుతం ఈ నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

పార్లమెంటు లోపల అరెస్టయిన యువకుల పేర్లు సాగర్ శర్మ, మనోరంజన్.డీ. వీరు కర్ణాటకలోని మైసూర్ వాసులు. ఇది కాకుండా ఢిల్లీ పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం, రవాణా భవన్ ముందు అరెస్టు చేసిన ఇద్దరు ఆందోళనకారులను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. వారి పేర్లు నీలం(42), అన్మోల్ షిండే(25)గా పేర్కొన్నారు. నీలం మొదట హర్యానాలోని హిసార్ నివాసి. అన్మోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్‌లో నివసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వసుంధర రాజే వల్లే దియా కుమారికి సీఎం కుర్చీ మిస్ అయిందా? డిప్యూటీ సీఎం అయ్యాక దియా ఏమన్నారంటే?

ట్రాన్స్‌పోర్ట్ భవన్ ముందు నిరసనకు దిగిన నీలం, అన్మోల్‌లు గ్యాస్ స్ప్రే చేయడంతో పాటు ‘భారత్ మాతాకీ జై’, ‘నియంతృత్వం పనిచేయదు’ వంటి నినాదాలు చేశారు. ఇక.. పార్లమెంటు లోపల జరిగిన సంఘటన గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. రవాణా భవన్ ముందు అరెస్టు చేసిన వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించారు. ‘‘ప్రాథమిక విచారణ జరిగింది. సమగ్ర విచారణ నివేదిక కూడా తర్వాత ఇస్తాం. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ లోపలే ఉన్నారు. బయట హంగామా చేసిన వారిని కూడా అరెస్టు చేశారు” అని తెలిపారు.

ఇదిలా ఉండగా, పార్లమెంటులోకి ప్రవేశించిన ఇద్దరు యువకుల గురించి అమ్రోహా ఎంపీ డానిష్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ శర్మ, మనోరంజన్.డిలు ఇద్దరు యువకులకు బీజేపీ నాయకుడు ప్రతాప్ సిన్హా కార్యాలయం ద్వారా పాస్‌లు జారీ చేయబడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. లోక్‌సభలోకి దూకిన యువకులిద్దరూ టియర్ గ్యాస్ షెల్స్‌ను మోసుకెళ్లారు. జీరో అవర్ సమయంలో వారిలో ఒకరు టేబుల్స్‌పైకి దూకడం కనిపించగా, మరొక యువకుడు పబ్లిక్ గ్యాలరీకి వేలాడుతూ, టియర్‌గ్యాస్‌ను చల్లడం కనిపించింది.

ఇది కూడా చదవండి: చంపేస్తామంటూ దుబాయ్‌లో పూజా హెగ్డే‌కి బెదిరింపులు