Harish Rao: దీన్ని కూడా కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గు చేటు: హరీశ్ రావు

మొదటి నుంచి సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని కేసీఆర్ పట్టుబడుతున్నారని తెలిపారు.

Harish Rao

కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమేనని తెలిపారు.

మొదటి నుంచి సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని కేసీఆర్ పట్టుబడుతున్నారని తెలిపారు. ఇప్పుడు ట్రైబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని చెప్పారు. దీన్ని కూడా కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు.

అసలు ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్ 89 తెచ్చిందే కేంద్రంలోని కాంగ్రెస్ అని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని చెప్పారు. ఆ తప్పిదాన్ని సరిదిద్దేందుకు బీఆర్ఎస్‌కు పదేళ్లు కాలం పట్టిందని తెలిపారు. కృష్ణాలో న్యాయమైన వాటా దక్కేదాక బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం 2023లో అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం జారీ చేసిన టీఓఆర్‌పై తొలుత ఇరు రాష్ట్రాల వాదనలు వినాలని బ్రిజేశ్‌ చుమార్ ట్రైబ్యునల్‌ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం తదుపరి వాదనలు విననుంది. టీఓఆర్‌పై వచ్చేనెల 19 నుంచి 21 వరకు వాదనలు ఉంటాయి.

Manish Sisodia: ఇండియా కూటమి గురించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు