Manish Sisodia: ఇండియా కూటమి గురించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ముఖ్యమని మనీశ్ సిసోడియా తెలిపారు

Manish Sisodia: ఇండియా కూటమి గురించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు

Manish sisodia

Updated On : January 17, 2025 / 4:45 PM IST

ఇండియా కూటమి గురించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటన్నది అసలు ఒక విషయమే కాదని అన్నారు.

కానీ, ఢిల్లీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ముఖ్యమని మనీశ్ సిసోడియా తెలిపారు. కేజ్రీవాల్ మాత్రమే ఢిల్లీలోని పిల్లలకు, వారి భవిష్యత్తుకు సాయం చేయగలరని చెప్పారు. ఢిల్లీ ప్రజల భవిష్యత్తును అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కాపాడగలరని అన్నారు.

ప్రజల భవిష్యత్తు కోసమే ఆప్‌ పోరాటమని మనీశ్ సిసోడియా తెలిపారు. కూటమి, పార్టీ, నాయకులు వీటన్నింటి భవిష్యత్తు గురించి మనకెందుకని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, మంచి చదువులు చదివిస్తారా? లేదా? అన్నదే అసలైన విషయమని తెలిపారు.

బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని, అయితే ముందుగా వారి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని మనీశ్ సిసోడియా ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారో తనకు తెలియదని, కానీ తాను జంగ్‌పురా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ నియోజక వర్గంలోని ప్రతి వ్యక్తి డిప్యూటీ సీఎం అవుతారని అక్కడి నమ్ముతున్నారని తెలిపారు.

KTR: ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి అసత్యాలు చెప్పారు: కేటీఆర్