KTR: ఢిల్లీలో రేవంత్ రెడ్డి అసత్యాలు చెప్పారు: కేటీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని, వానాకాలం పంట సహాయం కూడా ప్రభుత్వం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అరకొర మాత్రమే అమలు చేస్తున్నారని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు మహా ధర్నాలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. రెండు లక్షల రుణమాఫీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేయలేదా అని నిలదీశారు. రుణమాఫీ 100 శాతం జరిగినట్లు ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీలో చెప్పానని అన్నారు.
రుణమాఫీ మొత్తం జరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అందరం రాజీనామా చేస్తామని చెప్పామని కేటీఆర్ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించలేదని తెలిపారు. వానాకాలం వంట సహాయం ప్రభుత్వం అందించలేదని, రుణమాఫీపై ఇది ఆరంభం మాత్రమేనని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని, వానాకాలం పంట సహాయం కూడా ప్రభుత్వం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు రైతులకు ఉన్న వాకింగ్ చెల్లించాలని డిమాండ్ చేయాలని అన్నారు.
కాంగ్రెస్ హామీలపై ఎన్నికల్లో ఆ పార్టీ నేతలను నిలదీయాలని కేటీఆర్ చెప్పారు. మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళకు 30 వేల రూపాయలు బాకీ పడ్డారని తెలిపారు. ఓట్ల స్థానిక ఎన్నికల్లో కోసమే రైతు భరోసాను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.
ఆ తర్వాత రైతు భరోసా పథకం నిలిచిపోతుందని, కాంగ్రెస్‌లో పెళ్లిళ్లు చేసుకున్న యువకులకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ పడిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చేవెళ్లలలో అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలో వస్తుందని, ఇక్కడి ప్రజలు గెలిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. పార్టీ ఫిరాయింపు చేసిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఉప ఎన్నికలు వస్తాయని చెప్పుకొచ్చారు.
Delhi Assembly Polls: ఢిల్లీ ఎన్నికల బీజేపీ మ్యానిఫెస్టో విడుదల.. ఏయే హామీలు ఇచ్చారో తెలుసా?