Delhi Assembly Polls: ఢిల్లీ ఎన్నికల బీజేపీ మ్యానిఫెస్టో విడుదల.. ఏయే హామీలు ఇచ్చారో తెలుసా?

హోలీ, దీపావళి పండుగల వేళల్లో ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.

Delhi Assembly Polls: ఢిల్లీ ఎన్నికల బీజేపీ మ్యానిఫెస్టో విడుదల.. ఏయే హామీలు ఇచ్చారో తెలుసా?

Updated On : January 17, 2025 / 3:41 PM IST

బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి నడ్డా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే పేద వర్గాల మహిళలకు రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్‌ను అందిస్తుందని చెప్పారు.

అంతేగాక, హోలీ, దీపావళి పండుగల వేళల్లో ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉచితంగా ఇస్తుందని ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలో తాము 500 హామీలు ఇచ్చామని, వాటిలో 499 నెరవేర్చామని చెప్పారు. 2019లో 235 హామీలు ఇచ్చి 225 హామీలు నెరవేర్చామని తెలిపారు. మిగిలినవి అమలు దశలో ఉన్నాయని చెప్పారు.

నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. దేశంలో గతంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది ఇప్పుడు ఆ పేదరికం నుంచి బటయపడ్డారని తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ తాము కూడా కొనసాగిస్తామని చెప్పారు. తమ ముఖ్య లక్ష్యం సుపరిపాలన, అభివృద్ధి, మహిళా సాధికారత, రైతుల పురోగతి అని వివరించారు.

కాగా, ఢిల్లీలో జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ దాఖలుకు ఇవాళే చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన జనవరి 18న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 20. ఫిబ్రవరి 5 పోలింగ్.. ఫిబ్రవరి 8 ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. ఫిబ్రవరి 10 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

Ganta Srinivasa Rrao: మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు