మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీల మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని తెలిపారు. మహారాష్ట్రలో ఓటమి తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ మోసాలు మానుకోవాలని అన్నారు.
లగచర్ల ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని హరీశ్ రావు చెప్పారు. లగచర్లలో ప్రజలు తిరగబడితే ఇండస్ట్రియల్ కారిడార్ అని మాటమార్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి లగచర్లకు వెళ్లి ప్రజలను ఒప్పించి భూసేకరణ చేయాలని ఆయన సవాలు విసిరారు.
లగచర్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని అసత్యాలు చెబుతున్నారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని హరీశ్ రావు విమర్శించారు. లగచర్లకు నేతలు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం 1800 మందికి దళిత బంధు నిధులను మంజూరు చేసిందని అన్నారు. ఆ మంజూరు చేసిన నిధులను కూడా వాడుకోకుండా కాంగ్రెస్ సర్కారు నిలిపివేసిందని తెలిపారు.
KTR: ఈ నెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్: కేటీఆర్