Headmaster Protest
retirement age 61 years : తెలంగాణలో ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటున్నారు. సాధారణంగా రిటైర్మెంట్ వయసును పెంచాలని ఉద్యోగులు కోరుకుంటారు. కానీ ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు రిటైర్మెంట్ వయసు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్ వయస్సు పెంపు వద్దని నిన్న ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.