High Court : కాళేశ్వరం పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి ఆదేశం

కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పీఎస్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు.

High Court : కాళేశ్వరం పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి ఆదేశం

Telangana High Court

Updated On : December 19, 2023 / 12:08 PM IST

Telangana High Court : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కో ఆర్డినేషన్ చైర్మన్ నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. నిరంజన్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికలకు ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదులను అనుసరించి రాష్ట్ర సీఎస్ కు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. సీఎస్ నుండి సమాచారం తీసుకుని రెండు వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Also Read : ఒకే కుటుంబంలో ఆరుగురు హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అస్త్రంగా మార్చేలా సీఎం రేవంత్‌ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవ‌కత‌వ‌క‌లు, అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ గత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. కాళేశ్వరంపై జుడిషియ‌ల్ విచార‌ణతో పాటు అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం నిర్మాణం సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌.. అప్పటి అసెంబ్లీలో ఏ విధంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేష‌న్ ఇచ్చారో.. ఇప్పుడు సేమ్‌ టు సేమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేష‌న్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి డిసైడ్‌ అయ్యారు. తన రివెంజ్ ప్లాన్‌లో భాగంగా ఏ వేదికపై నుంచి ప్రాజెక్టు గొప్పతనం చెప్పారో.. అదే వేదికలో అందులో డొల్లతనం వివరించాలని అనుకుంటున్నారు.

మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఎల్‌ అండ్ టీ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేసేది లేదని ఎల్‌ అండ్ టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎల్‌ అండ్ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక లేఖ అధికారికి రాసి తమ ప్రమేయం లేదంటే ఊరుకోబోమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసిన వారిని వదిలి పెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.