Tauktae Effect : హైదరాబాద్‌లో భారీవర్షం..

అరేబియా సముద్రంలో భీకర తుపాను ‘తౌక్టే’ ప్ర‌భావం తెలంగాణపై పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మంగళవారం ఉద‌యం (మే 18) నగరంలో ప‌లు చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది.

Heavy Rain In Hyderabad City Before Lockdown Time Hours

Tauktae Effect -Heavy Rain Hyderabad : అరేబియా సముద్రంలో భీకర తుపాను ‘తౌక్టే’ ప్ర‌భావం తెలంగాణపై పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మంగళవారం ఉద‌యం (మే 18) నగరంలో ప‌లు చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. వ‌ర్షం కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సైదాబాద్‌, రాజేంద్ర న‌గ‌ర్‌, అత్తాపూర్, బండ్ల‌గూడ జాగీర్‌, కిస్మ‌త్‌పుర్‌, గండిపేట్‌, గ‌గ‌న్‌ప‌హ‌డ్, మ‌ల‌క్‌పేట్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, కొత్త‌పేట‌, వ‌న‌స్థ‌లిపురం, యూస‌ఫ్‌గూడ‌, రహ్మ‌త్‌న‌గ‌ర్, కృష్ణానగ‌ర్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌ల్లులు కురిశాయి. లాక్‌డౌన్ సడలింపు సమయంలో వర్షం పడటంతో బయటకు వెళ్లిన వారంతా ఇబ్బందులు పడ్డారు. ఇంజినీరింగ్, డీఆర్ఎఫ్ టీమ్‌లు అప్రమత్తమయ్యారు.