Heavy Rain : మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన.. కొట్టుకుపోయిన బైకులు..!

Heavy Rain Telangana : మెదక్‌లో అత్యధికంగా 12.6 సెం.మీ, పాతురులో 8.6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డి జిల్లాలో 6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.

Heavy Rain in Medak District

Heavy Rain : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్సాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీవర్షం కురిసింది. మెదక్ పట్టణంలో దాదాపు గంటన్నర పాటు ఎడతెరపి లేకుండా ఏకధాటిగా వర్షం కురిసింది. దాంతో 12.6 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. మెదక్ పట్టణంలో ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వర్షంలో బైకులు కొట్టుకుపోయాయి. బైకుల కోసం వాహనదారులు పరుగులు పెట్టారు.

మెదక్‌లో అత్యధికంగా 12.6 సెం.మీ, పాతురులో 8.6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డి జిల్లాలో 6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. సాయినగర్‌, రాందాస్ చౌరస్తా, ఆటో నగర్‌ కాలనీల్లో వరదనీరు చేరడంతో అక్కడి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Read Also : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్‌ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?

ట్రెండింగ్ వార్తలు