Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో పలు కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్‌ నుంచి శేరిలింగంపల్లి వరకు రహదారులు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది.

Rain

Heavy Rains : తెలంగాణలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడుతున్నాయి. మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో పలు కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్‌ నుంచి శేరిలింగంపల్లి వరకు రహదారులు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. నిజాంపేట బండారి లేఅవుట్‌, బృందావన్‌కాలనీ, బాలాజీనగర్‌, శ్రీనివాసకాలనీ, బాచుపల్లి, రాజీవ్‌గాంధీనగర్‌, జయదీపికా ఎస్టేట్‌ తదితర ప్రాంతాల్లో నాలాలు లేకపోవడంతో రోడ్లపై నడుము లోతున వరద నీరు నిలిచింది.

Heavy Rain : తెలంగాణలో మళ్లీ జోరు వానలు..హైదరాబాద్ లో భారీ వర్షం

హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో రాత్రి నుంచి వ‌ర్షం కురుస్తోంది. మ‌రికొద్ది గంట‌ల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే తెలంగాణ వ్యాప్తంగా మ‌రో నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.