×
Ad

Heavy Rains : రాగల రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

శనివారం, ఆదివారం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.  శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద 5.8కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఆవర్తనం బలహీన పడిందని తెలిపారు.

Heavy Rains (10)

Telangana Heavy Rains : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం, సోమవారం కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

శనివారం, ఆదివారం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.  శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద 5.8కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఆవర్తనం బలహీన పడిందని తెలిపారు. శనివారం వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిస్సా – గంగటిక్ పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్రమట్టం నుండి 5.8కిలోమీటర్ల ఎత్తువరకు ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుగా వంగి ఉందని తెలిపింది.

Kottu Satyanarayana : నువ్వు పెయిడ్ ఆర్టిస్టువి.. చంద్రబాబు కోసం కిరాయికి మాట్లాడుతున్నావు : పవన్ కళ్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్

ఈ ఆవర్తనం రాగల 2 నుండి 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిస్సా, పరిసరాలలోని గంగటిక్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో 18వ తేదీన ఏర్పడే మరొక ఆవర్తనం అవకాశం ఉందని పేర్కొంది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వెల్లడించింది.