Heavy Rains : తెలంగాణాలో మూడురోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడురోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం వాతావరణ కేంద్రం సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది.

Heavy rains in Telangana : తెలంగాణలో రానున్న మూడురోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం వాతావరణ కేంద్రం పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. నిన్న తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా దక్షిణ తమళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉన్నది. ఇవాళ దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుండి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది.

నిన్న వాయువ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒడిస్సా – పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఇవాళ గంగేటిక్ పశ్చిమ బంగాల్, పరిసర ప్రాంతాల్లో ఉండి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు కొనసాగుతుందని తెలిపింది. దీంతో ఇవాళ, ఎల్లుండి పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

Heavy Rain : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు