Heavy Rain : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మొజాంజాహి మార్కెట్, కోఠి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుల్తాన్ బజార్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం భారీ వర్షం కురిసింది.

Heavy Rain
Heavy Rain : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మొజాంజాహి మార్కెట్, కోఠి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుల్తాన్ బజార్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంలో కూడా వినాయక శోభాయాత్రను కొనసాగించారు భక్తులు. గణపతి బప్పా మోరియా నినాదాలతో నగరం మొత్తం మారుమోగుతోంది.
Read More : Ganesh Idol is Immersed : గణేషుడ్నే ఎందుకు నిమజ్జనం చేస్తారు ?
కోలాటాలు, డాన్సులు, గణనాథుడి పాటలతో శోభాయాత్ర సాగుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ కు వచ్చాయి. వర్షంలో కూడా నిమజ్జనం కొనసాగిస్తున్నారు మునిసిపల్ సిబ్బంది, అధికారులు. ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సాయంత్రం వరకు జరగనుంది. గణేష్ శోభాయాత్రను వీక్షించేందుకు వేలసంఖ్యలో భక్తులు హుస్సేన్ సాగర్ చేరుకున్నారు.
Read More : Ganesh Laddu: మై హోం భూజా, బాలాపూర్ లడ్డూల వేలంలో రికార్డు ధర