Telangana Heavy Rains : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.

Heavy Rains (6)

Heavy Rains : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్నాయని.. దాంతో వర్షలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
నిన్న (మంగళవారం) పలు జల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి.

Rain In AP : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి.. ఏపీలో కురుస్తున్న వర్షాలు

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. బుధవారం, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Heavy Rains: గుజరాత్‭ను ముంచేసిన భారీ వర్షాలు.. ఇప్పటి వరకు 9 మంది మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో అత్యధికంగా సిద్దిపేటలో 193.3 సెంటీమీటర్ల వర్షపాతం, మెదక్ లో 173 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డిలో 159.3, జనగామలో 132.5, మంచిర్యాలలో 120.5, వికారాబాద్ లో 120.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

బుధవారం, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు కురవాలంటూ కామారెడ్డి జిల్లాలోని పెద్దకొడపగల్ పాపనేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో జలాభిషేకం చేశారు. శివపార్వతులు గణపతి విగ్రహాలను భక్తులు నీటితో నింపారు.