Rain In AP : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి.. ఏపీలో కురుస్తున్న వర్షాలు
కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

AP Rain
Bay of Bengal Droni : నైరుతి రుతుపనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశంలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా.
బుధవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పొలం పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.